ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. శనివారం ఉదయం 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని ముద్దాడనుంది.
ఈ అపూర్వ ఘటనకు ముందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... చంద్రయాన్-2 గాథలతో ముందుకొచ్చింది. ఆర్బిటర్, ల్యాండర్ 'విక్రమ్', రోవర్ 'ప్రజ్ఞాన్' మధ్య ఓ చమత్కార సంభాషణ జరిగినట్లుగా ఓ సన్నివేశాన్ని సృష్టించి ట్విట్టర్ వేదికగా మనందరితో పంచుకుంది.
సెప్టెంబర్ 2న చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వీడిపోయింది. దీన్ని సరదా సంబాషణగా మలుస్తూ ఓ కామిక్ స్ట్రిప్‌ను ఇస్రో రూపొందించింది.
-
We have the same wishes for Vikram, Orbiter.
— ISRO (@isro) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Want to stay in touch with Vikram and Pragyan as they make their way to the untouched lunar South Pole and uncover its many mysteries? Then keep an eye out for the next edition of #CY2Chronicles! pic.twitter.com/2iA8W2lxtR
">We have the same wishes for Vikram, Orbiter.
— ISRO (@isro) September 6, 2019
Want to stay in touch with Vikram and Pragyan as they make their way to the untouched lunar South Pole and uncover its many mysteries? Then keep an eye out for the next edition of #CY2Chronicles! pic.twitter.com/2iA8W2lxtRWe have the same wishes for Vikram, Orbiter.
— ISRO (@isro) September 6, 2019
Want to stay in touch with Vikram and Pragyan as they make their way to the untouched lunar South Pole and uncover its many mysteries? Then keep an eye out for the next edition of #CY2Chronicles! pic.twitter.com/2iA8W2lxtR
సంభాషణ సాగిందిలా..
ఆర్బిటర్: ఇప్పటి వరకు నీతో చేసిన ప్రయాణం చాలా బాగుంది విక్రమ్.
విక్రమ్: నిజమే మనది సుదీర్ఘ ప్రయాణం. నేను నిన్ను చంద్రుని కక్ష్యలో చూస్తూనే ఉంటాను.
ఆర్బిటర్: గుడ్ లక్ విక్రమ్! ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువంలోకి వెళ్తున్నావుగా.
( ఇస్రో మధ్యలో కల్పించుకొని...)
ఇస్రో: ఆర్బిటర్, విక్రమ్ మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. ఆర్బిటర్ మరేం బాధపడకు. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో నీవు సన్నిహితంగానే ఉంటావులే. మీరందరూ కలిసి పని చేసి చంద్రుని దక్షిణ ధ్రువంలోని రహస్యాలు ఛేదించండి.
(ఇలా సరదాగా ఇస్రో.. ఆర్బిటర్, విక్రమ్ సంభాషణ జరిగింది.)
ఇలా యాక్టివేట్ అవుతుంది
విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన వెంటనే, దానిలోని మూడు పేలోడ్లు ఉత్తేజితమవుతాయి. తరువాత విక్రమ్‌లో ఉంచిన రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. రెండు పేలోడ్ల సాయంతో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది.
రోవర్ ప్రజ్ఞాన్ తను సేకరించిన సమాచారాన్ని కేవలం ల్యాండర్ విక్రమ్‌తో మాత్రమే పంచుకోగలదు. విక్రమ్ మాత్రం తన వద్ద ఉన్న సమాచారాన్ని... బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేష్ నెట్‌వర్క్‌తో (ఐడీఎస్ఎన్) పంచుకోగలదు. అలాగే ఆర్బిటర్, రోవర్లతో సమాచారం పంచుకోగలదు.
ఈ విషయాలు తెలుసుకోండి: చంద్రయాన్-2: తెలుసుకోవాల్సిన విషయాలు