ETV Bharat / bharat

నూతన వ్యవసాయ చట్టాలకు ఇజ్రాయెల్​ కితాబు - భారత్ ఇజ్రాయెల్​ న్యూస్​

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు భారత్​లోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాలు ఎక్కువై గరిష్ఠ లాభాలు పొందవచ్చన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయన్న వాదన సరి కాదన్నారు. ఇందుకు ఇజ్రాయెల్ అనుభవాలే ఉదాహరణ అన్నారు.

Israel diplomat lauds news farm bills by centre
నూతన వ్యవసాయ చట్టాలకు ఇజ్రాయెల్​ కితాబు
author img

By

Published : Oct 12, 2020, 8:07 AM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు అన్ని విధాలా మేలు చేస్తాయని భారత్​లోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాలు ఎక్కువై గరిష్ఠ లాభాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం ఈ చట్టాలపై జరుగుతున్న ఆందోళనలు సద్దుమణిగాక.. రైతులు ఈ ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీఐ ఇంటర్వ్యూలో తెలిపారు.

భారత్​- ఇజ్రాయెల్ భాగస్వామ్యం బలంగా ఉందంటే​ వ్యవసాయ రంగంలో ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం కూడా ఓ కారణమని మల్కా చెప్పారు. నూతన చట్టాలతో ఈ సహకారం మరింత బలోపేతమవుతుందన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయన్న వాదన సరి కాదన్నారు. ఇందుకు ఇజ్రాయెల్ అనుభవాలే ఉదాహరణ అన్నారు.

'ఇజ్రాయెల్​ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్​లో మధ్యవర్తులు ఉండరు. రైతులు నేరుగా వినియోగదారులతో అనుసంధానం అయ్యేలా పారదర్శకత ఉంటుంది. ఈ దిశగా డిజిటల్ ఫ్లాట్​ఫాంలు సమర్థంగా పనిచేస్తున్నాయి. భారత్​లోనూ అవే డిజిటిల్​ ఫ్లాట్​ఫాంలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని వినియోగించుకోవచ్చు ' అని రామ్​ మల్కా చెప్పారు. చాలా కాలంగా ఉన్న మార్కెటింగ్​ పద్ధతులు మారుతుంటే కొంత ఆందోళన సహజమేనని, ఈ విషయంలో రైతుల్లో ఉన్న అపోహలు తొలగేందుకు కాస్త సమయం పడుతుందని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.