ETV Bharat / bharat

ఐసిస్​ ఉగ్రవాది అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం - ఐసిస్​

ఐసిస్​కు చెందిన ఉగ్రవాదిని దిల్లీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అతని నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ISIS operative held in Delhi
దిల్లీలో ఐసిస్​ ఉగ్రవాది అరెస్టు
author img

By

Published : Aug 22, 2020, 9:42 AM IST

Updated : Aug 22, 2020, 12:55 PM IST

దిల్లీ రిడ్జ్ రోడ్​​ ప్రాంతంలోని బుద్ధ జయంతి పార్క్ సమీపంలో ఐసిస్​తో సంబంధం ఉన్న ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి ఐఈడీ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసింది.

దిల్లీలో ఐసిస్​ ఉగ్రవాది అరెస్టు

ద్విచక్రవాహనం మీద వెళ్తున్న ఉగ్రవాదిని ఆపి తనిఖీ నిర్వహించగా.. అతని వద్ద బాంబులను గుర్తించారు పోలీసులు. అతడిని నిలువరించే ప్రయత్నంలో అధికారులపై కాల్పులకు తెగబడ్డాడు ఉగ్రవాది. ధౌలా కువాన్, కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత శుక్రవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డీసీపీ ప్రమోద్​ సింగ్​ వెల్లడించారు. పార్క్​ పరిసరప్రాంతంలో ముష్కరులు ఎవరైనా ఉన్నారెమోనని జాతీయ భద్రతా దళాలు, దిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ISIS operative held in Delhi
భద్రతా సిబ్బంది

Last Updated : Aug 22, 2020, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.