ETV Bharat / bharat

'చిదంబరం ఆరోగ్యంపై అధ్యయనానికి మెడికల్​ బోర్డ్​' - INX case

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై మెడికల్​ బోర్డు ఏర్పాటు చేయాలని  దిల్లీ హైకోర్టు ఆదేశించింది. బోర్డు నేడు సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని.. రేపు కోర్టుకు నివేదిక అందించాలని సూచించింది.

'చిదంబరం ఆరోగ్యంపై అధ్యయనానికి మెడికల్​ బోర్డ్​'
author img

By

Published : Oct 31, 2019, 1:14 PM IST

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు తక్షణమే మెడికల్​ బోర్డు​ ఏర్పాటు చేయాలని దిల్లీ ఎయిమ్స్​​ను ఆదేశించింది అక్కడి హైకోర్టు. ప్రస్తుతం ఈ కాంగ్రెస్​ సీనియర్​ నేత.. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయి జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నారు.

క్రోన్స్​ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటూ.. బెయిల్​ మంజూరు చేయాలని చిదంబరం కోరిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.
బెయిల్​ పిటిషన్​పై న్యాయమూర్తి జస్టిస్​ సురేష్​ కైత్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మెడికల్​ బోర్డు ఈ రోజు సమావేశమై చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై చర్చించాలని.. రేపు కోర్టుకు నివేదిక అందించాలని సూచించింది. చిదంబరం కుటుంబ వైద్యుడు, హైదరాబాద్​కు చెందిన జీర్ణాశయ ప్రేగు వైద్య నిపుణులు డా. నాగేశ్వర్​ రెడ్డిని బోర్డు సభ్యుడిగా నియమించాలని ఆదేశించింది.

ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో... ఐఎన్​ఎక్స్​ మీడియా మనీ లాండరింగ్​ కేసులో మధ్యంతర బెయిల్​ మంజూరు చేయాలని కోరారు చిదంబరం. ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోందని, పరిశుభ్ర వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.

ఇదీ చూడండి: రాజకీయ పులిస్వారీ.. 'పీఠ'ముడి వీడేనా..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.