జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించనుంది కేంద్ర ప్రభుత్వం. మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్ సేవలనూ అందించనుంది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ వెల్లడించారు. ఇటీవల స్కాలర్షిప్ అప్లికేషన్ తదితర సేవలకు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. డిసెంబరు 10న కొంత మేరకు ఎస్సెమ్మెస్ సేవలను పునరుద్ధరించారు అధికారులు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతల దృష్ట్యా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపేశారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కన్సల్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్‌ఫోన్స్, డేటా కేబుల్స్ ఫ్రీ