ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో​ సాధారణ పరిస్థితులే: అమిత్​ షా - amithshan on kashmir issue

జమ్ముకశ్మీర్ స్థితిగతులపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కేంద్ర హోంమంత్రి. అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయని స్పష్టంచేశారు.

జమ్ముకశ్మీర్​లో​ సాధారణ పరిస్థితులే: అమిత్​ షా
author img

By

Published : Nov 20, 2019, 1:20 PM IST

Updated : Nov 20, 2019, 2:31 PM IST

జమ్ముకశ్మీర్​లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని స్పష్టంచేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఆర్టికల్ 370 రద్దు అనంతర స్థితిగతులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు హోంమంత్రి.

ఆగస్టు 5 తర్వాత ఒక్క వ్యక్తి కూడా పోలీసు కాల్పుల్లో మృతి చెందలేదని, రాళ్లదాడులు వంటి ఘటనలు గతేడాదితో పోల్చితే తగ్గాయని చెప్పారు. పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరుచుకున్నాయని, విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉందన్నారు షా.

కశ్మీర్​లో అన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు పని చేస్తున్నాయని స్పష్టంచేశారు షా. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత పత్రికల సర్క్యులేషన్​ తగ్గలేదని చెప్పారు.

రాత్రిపూటే ఆంక్షలు..

144 సెక్షన్​ను ఇప్పటికే ఎత్తేశామని, రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు భద్రతా కారణాల రీత్యా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని వివరించారు అమిత్​ షా.

అంతర్జాల నిలిపివేత అందుకే...

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కశ్మీర్​లోని ఉన్నతాధాకారుల అభిప్రాయం తీసుకున్న అనంతరమే అంతర్జాల సేవలు పునః ప్రారంభిస్తామన్నారు షా. ఇప్పటికే ల్యాండ్​లైన్ ఫోన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

అందుబాటులో వైద్యం..

కశ్మీర్​లో వైద్యానికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అమిత్ షా. మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని చెప్పారు.

జమ్ముకశ్మీర్​లో​ సాధారణ పరిస్థితులే: అమిత్​ షా

"జమ్ముకశ్మీర్​లో 144 సెక్షన్​ అమలులో లేదు. పూర్తిస్థాయిలో ఎత్తేశాం. రాత్రి 8 నుంచి 6 గంటల వరకు ఆంక్షలను అమలు చేస్తున్నాం. అంతర్జాల సేవలను పునఃప్రారంభించే అంశంలో స్థానిక అధికారుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం. కశ్మీర్​లో దాయాది దేశ ప్రోద్బలంతో పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటాయని మనందరికీ తెలుసు. ఆ ప్రాంత పరిస్థితులను, భద్రతను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా ఏ సమస్యా లేదు. సంచార ఔషధ దుకాణాలు ఏర్పాటు చేశాం."

-అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి: 'చిదంబరానికి బెయిల్​'పై ఈడీకి సుప్రీం తాఖీదులు

Mumbai, Nov 20 (ANI): Bollywood actor Shahid Kapoor was spotted post his gym session in Mumbai. He was seen clicking pictures with fans. Actor Varun Dhawan was also seen outside a gym. He will be next seen in 'Street Dancer'. Actor Vatsal Seth was also spotted outside a fitness center.
Last Updated : Nov 20, 2019, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.