ETV Bharat / bharat

విద్యుత్​ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బుడతడు.. కారణమిదే! - విద్యుత్​ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బాలుడు

చిన్నపిల్లలు సరదాగా ఆడుకునేటప్పుడు చెట్లు, గోడలు ఎక్కడం సాధారణమే. అయితే ఒడిశా జాజ్​పుర్​లో మాత్రం ఓ ఐదేళ్ల బుడతడు ఏకంగా విద్యుత్​ స్తంభం ఎక్కేశాడు. ఆ సమయంలో కరెంట్​ లేకపోవడం వల్ల బతికిబయటపడ్డాడు. ఇంతకీ బాలుడు కరెంట్​ స్తంభం ఎక్కింది ఎందుకో మీరే చదవండి.

Interestingly, a 5-year-old boy climbing on an electric pole to see vehicles
విద్యుత్ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బాలుడు.. ఎందుకో తెలుసా?
author img

By

Published : May 26, 2020, 5:12 PM IST

ఒడిశా జాజ్​పుర్​​ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలుడు రహదారిపై వెళ్లే వాహనాలను చూసేందుకు పెద్ద సాహసమే చేశాడు. వాహనాలు కనబడటం లేదని ఏకంగా విద్యుత్​ స్తంభం ఎక్కేశాడు. ఆ సమయంలో కరెంట్​ లేకపోవడం వల్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.

విద్యుత్ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బాలుడు.. ఎందుకో తెలుసా?

ఏం జరిగింది?

జాజ్​పూర్​ జిల్లా కొరే పోలీస్​ స్టేషన్​​ ఎదుట 20వ నంబర్​ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను చూసేందుకు దగ్గరలో ఉన్న విద్యుత్​ స్తంభం ఎక్కేశాడు బుడతడు.​ బాలుడితో పాటు తన సోదరి కూడా ఎక్కడానికి ప్రయత్నించింది. వారు స్తంభం ఎక్కే సమయానికి కరెంట్​ లేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని చూసి వారించి కిందకి దింపాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత్​ శాఖ అధికారులు బాలుడ్ని అలా వదిలేసినందుకు కుటుంబాన్ని వారించారు.

ఇదీ చూడండి: కరోనా వేళా.. రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.