ETV Bharat / bharat

'రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం' - phone calls defence ministers calls

అమెరికా రక్షణ మంత్రి లాయ్డ్ ఆస్టిన్​తో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఫోన్​లో మాట్లాడారు. ఉగ్రవాదం సహా పలు అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు చర్చించారు. అదేసమయంలో, భారత్-అమెరికా దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సంప్రదింపులు జరిగాయి.

india us
'రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం'
author img

By

Published : Jan 28, 2021, 5:11 AM IST

జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి భారత్-అమెరికా మధ్య అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిగాయి. అమెరికా రక్షణ మంత్రి లాయ్డ్ ఆస్టిన్.. భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ పరస్పరం ఫోన్​లో సంభాషించుకున్నారు. ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్​లో శాంతి పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు చర్చించారు. ఇరుదేశాల రక్షణ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. చైనా అంశం సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

"అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ నుంచి పరిచయ ఫోన్​కాల్​ను రాజ్​నాథ్ స్వీకరించారు. 'బహుముఖ' రక్షణ సహకారం, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కలిసి పని చేయాలని ఇరువురు నిర్ణయించారు."

-రక్షణ శాఖ ప్రకటన

ఈ సంభాషణపై అధికారిక ప్రకటన విడుదల చేసిన అమెరికా రక్షణ శాఖ... భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం పరస్పర విలువలపై నిర్మితమైందని తెలిపింది. ఇండో పసిఫిక్​పై విషయంపై ఇరుదేశాలకు ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయని పేర్కొంది. భారత్​-అమెరికా రక్షణ రంగంలో సాధించిన పురోగతిని ఆస్టిన్ గుర్తించినట్లు వెల్లడించింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు వివరించింది.

భద్రతా సలహాదారుల చర్చ

మరోవైపు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాల్​తో అజిత్​ డోభాల్ ఫోన్​లో మాట్లాడారు. ఉగ్రవాదం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఇరుదేశాల మధ్య ప్రత్యేక సహకారం ఏర్పడిందని ఈ సందర్భంగా డోభాల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలతో కలిసి నడవాలన్న భావన ఇరుదేశాల్లోనూ ఉందని పేర్కొన్నారు.

ద్వైపాక్షిక అజెండాలతో పాటు, ఇతర సవాళ్లపై భారత్​తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు సులివాన్ తెలిపారు. వ్యూహాత్మక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.