ETV Bharat / bharat

కరోనా వేళ.. దిల్లీ విమానాశ్రయానికి ప్రపంచస్థాయి గుర్తింపు - indira gandhi international airport rank

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంది. కరోనా కాలంలోనూ ప్రపంచంలో సురక్షితమైన రెండో విమానాశ్రయంగా రికార్డు సాధించింది. ఈ మేరకు సేఫ్​ ట్రావెల్​ బారోమీటర్​ ప్రకటించింది.

delhi airport news
దిల్లీ విమానాశ్రయం అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండోది
author img

By

Published : Oct 22, 2020, 5:56 PM IST

కరోనా కాలంలోనూ వైరస్​ నిబంధనలను పాటిస్తూ విమానాశ్రయాలు సేవలందిస్తున్నాయి. అయితే ఇలాంటి మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడకుండా మరింత చర్యలు తీసుకుంటోంది దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ఎయిర్​పోర్టుల జాబితాలో రెండోస్థానం సాధించింది.

దాదాపు 200 విమానాశ్రయాల్లోని కరోనా జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించింది విడెస్​ సంస్థకు చెందిన 'సేఫ్​ ట్రావెల్​ బారోమీటర్'​. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో సింగపూర్​లోని చంగీ ఎయిర్​పోర్టు తొలి ర్యాంక్​ సొంతం చేసుకోగా.. జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ విమానాశ్రయం, చైనాలోని చెంగుడు అంతర్జాతీయ విమానాశ్రయం దిల్లీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాయి. కరోనా సమయంలో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతా విషయంలో ఇవి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతాపరమైన నిబంధనలను పర్యవేక్షించడానికి.. ప్రపంచంలోనే అతిపెద్ద, సమగ్రమైన సాధనాల్లో సేఫ్ ట్రావెల్ బారోమీటర్​ను కీలకంగా వ్యవహరిస్తారు.

"సింగపూర్​లోని చంగీ విమానాశ్రయం 5 పాయింట్లకు 4.7 సాధించింది. దిల్లీ ఐజీఐ ఎయిర్​పోర్టు 4.6 పాయింట్లతో సేఫ్​ ట్రావెల్​ బారోమీటర్​ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఫ్రాంక్​ఫర్ట్​, చెంగుడు విమానాశ్రయాలు దిల్లీతో సమంగా నిలిచాయి"

-- దిల్లీ విమానాశ్రయంలోని ఓ అధికారి

కరోనా కట్టడిలో భాగంగా దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులను నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు టచ్​లెస్​ సేవలు అందించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు యూవీ ఆధారిత క్రిమీసంహారక ప్రక్రియ అమలు చేస్తూ శానిటైజేషన్​ చేస్తున్నారు. ఎయిర్​ సువిదా పోర్టల్​ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు సులభతర సేవలు అందిస్తున్నారు నిర్వాహకులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.