దేశంలో కరోనా మరణాలు 872కు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1396 కొత్త కేసులు, 48 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు 27 వేల 892కు చేరాయి. మొత్తం 6,185 మంది కోలుకోగా.. 20 వేల 835 యాక్టివ్ కేసులున్నాయి.
![India's total number of #Coronavirus positive cases rise to 27,892](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6955445_india--glance--91.jpg)
భారత్‌లో వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 342 మంది కొవిడ్‌కు బలయ్యారు. అక్కడ బాధితుల సంఖ్య 8068గా ఉంది. రాష్ట్రంలో 1076 మంది కోలుకున్నారు. గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య 151కి చేరింది. తమిళనాడులో రికార్డు స్థాయిలో 1020 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.