దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే.. కొద్ది రోజులుగా కేసులు 90 వేల దిగువనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 81 వేల 484 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 1095 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గురువారం 10 లక్షల 97 వేల 947 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం.. మొత్తం టెస్టుల సంఖ్య 7 కోట్ల 67 లక్షలు దాటింది.