భారత్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ప్రతిరోజు గరిష్ఠస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నయి. తాజాగా 92,605 మంది కరోనా బారిన పడ్డట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,00,620కి చేరినట్లు తెలిపింది. కొత్తగా 1133 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 86752కి చేరింది.
మరోవైపు దేశంలో రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే 94,612 మంది కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 79.68 శాతానికి చేరినట్లు వైద్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.61 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.
- యాక్టివ్ కేసులు 10,10,824
- కోలుకున్నవారు 43,03,044
రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
దేశంలో గడిచిన 24 గంటల్లో 12 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఒకరోజులో నిర్వహించిన అత్యధిక పరీక్షలు ఇవేనని తెలిపింది. సెప్టెంబర్ 19 నాటికి మొత్తం 6,36,61,060 పరీక్షలు చేసినట్లు స్పష్టం చేసింది.