ETV Bharat / bharat

చందమామతో ఓ మాట చెప్పాలని... - విక్రమ్(ల్యాండర్)​

అంతరిక్ష రంగంలో భారత్​ చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్​-2కు సర్వం సిద్ధమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం.. ఈ ప్రయోగాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో. జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ద్వారా చంద్రయాన్​-2 జాబిల్లిపైకి పంపనుంది. ఈ మహోత్తర ఘట్టానికి ముహూర్తం మరికొద్ది గంటల్లోనే. సరిగ్గా.. సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్​-2తో నింగికెగియనుంది జీఎస్​ఎల్​వీ మార్క్​-3.

చంద్రయాన్​-2: జాబిల్లితో ఓ మాట చెప్పాలని...
author img

By

Published : Jul 14, 2019, 2:38 PM IST

Updated : Jul 15, 2019, 1:31 AM IST

చంద్రయాన్​-2: జాబిల్లితో ఓ మాట చెప్పాలని...

చందమామ రావే.. జాబిల్లి రావే.. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపించేప్పుడు పాడే లాలన ఇది. అప్పట్లో ఆ పసివాడికి తెలియదు.. చందమామ వస్తుందా.. రాదా అనేది. అలా పసితనపు ఛాయలతో నిజంగానే వస్తుందేమో అనుకొని అదే మైకంలో ఉండిపోతాడా పసివాడు.

చందమామ రావడం లేదు. మనమే అక్కడకు వెళ్లలేమా? ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ... 1969లో తొలిసారి అమెరికాకు చెందిన నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​, బజ్​ ఆల్డ్రిన్​ అపోలో నౌక ద్వారా చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత మరో 10 మంది వెళ్లారు. ఆ ప్రయాణాలు... వారివారి దేశ జెండాలు పాతేందుకు, తమ ముద్ర చాటేందుకే పరిమితమయ్యాయి.

భారత్​ ఇందుకు పూర్తి భిన్నమైన ప్రయాణానికి సిద్ధమైంది. జాబిల్లి పరిస్థితులపై పూర్తి అధ్యయనం కోసం, ఆవాసానికి వీలుందా అనే పరిశోధనల కోసం.. చంద్రయాన్​-2తో మహోత్తర ప్రయోగానికి సన్నద్ధమైంది ఇస్రో. జులై 15 తెల్లవారుజామున 2.51 గంటలకు ముహూర్తం.

''చంద్రయాన్​-2 భారత్​కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే 2008లోనే భారతదేశం ఆర్బిటర్​తో చంద్రుడిని చుట్టొచ్చింది. అనంతరం 2013లో మంగళ్​యాన్​ పేరుతో అంగారక గ్రహంపైకి విజయవంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే.. ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై మృదువుగా దిగేందుకు భారత్​ ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత క్లిష్టం. భారతదేశం తొలిసారి ఇలా ప్రయత్నిస్తోంది. కానీ.. అంతరిక్ష రంగంలో భారత భవిష్యత్తు కార్యకలాపాల కోసం ఇది కీలకం. ఈ ప్రయత్నం గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.''
- పల్లవ బగ్లా, విజ్ఞాన శాస్త్ర నిపుణుడు

చీకటి పడితే చాలు... లక్షల మైళ్ల దూరంలో కనిపిస్తూ ఊరించే చందమామ గురించి కథలు కథలుగా చెప్పుకోవడమే కానీ.. అక్కడకు ఓ యంత్రాన్ని పంపి బోలెడంత సమాచారాన్ని సేకరించవచ్చని ఎంతమందికి తెలుసు? ఆ కలను సాకారం చేసే దిశగానే ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.

2008లోనే తొలిసారి...

జాబిల్లిపైకి 2008లోనే భారత్​ చంద్రయాన్​-1 పేరుతో ఉపగ్రహం పంపింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత.. అక్కడి పరిస్థితుల అధ్యయనం కోసం ఇప్పుడు పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో యాత్ర చేపడుతోంది.

చంద్రయాన్​-1 అక్కడి కక్ష్యలోనే తిరిగి సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అంతరిక్ష రంగంలో భారత ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో 35 కిలోల ఇంపాక్టర్​ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడవగా... అది జాబిల్లిని బలంగా ఢీకొట్టింది. ఇంపాక్టర్​ బద్దలయ్యేలోపే.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఛాయాచిత్రాలు, సమాచారాన్ని సేకరించి భూమికి చేరవేసింది. దాదాపు 3 వేల సార్లు పరిభ్రమించి.. 70 వేల వరకు ఫొటోలను పంపింది.

చిన్న చిన్న ఇబ్బందులతో 2009 ఆగస్టు 29న చంద్రయాన్​-1తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రెండేళ్లు పనిచేసేలా రూపొందించినా 10 నెలలకే ప్రస్థానం ముగిసింది.

అయినా.. భారత అంతరిక్ష రంగంలో అదో అద్భుతం.. గొప్ప మైలురాయి... మరిచిపోలేని ఘనత. తొలిసారి.. చందమామపై నీరు, మంచు​ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది చంద్రయాన్​-1.

అమెరికా పంపిన 'మూన్​ మినరాలజీ మ్యాపర్' నీటి జాడను తొలిసారిగా గుర్తించినా... తదనంతరం ఇస్రో దీనిని నిర్ధరించింది.

అమెరికా పరికరం వల్లే..

మొదట చంద్రుడి కక్ష్యలోని ఉష్ణం వల్లే చంద్రయాన్​-1 అర్ధంతరంగా ముగిసిందని భావించినా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకొని పరిశోధనల్లో వాడిన డీసీ-డీసీ కన్వర్టర్​ అనే బుల్లి పరికరమే కారణమని వెల్లడైంది. అనంతరం దానినే సమర్థంగా దేశీయంగానే రూపొందించి.. ప్రతిష్టాత్మక మంగళ్​యాన్​ ప్రయోగంలోనూ విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఇప్పుడూ అదే వినియోగిస్తున్నారు.

పూర్తిగా స్వదేశానివే..

చంద్రయాన్​-1లో ప్రయోగించిన 11 పరికరాల్లో భారత్​వి 5 మాత్రమే. కానీ.. చంద్రయాన్​-2 లో పంపుతున్న 14 పరికరాల్లో 13 స్వదేశానికి చెందినవే. ఒకటి అమెరికాకు చెందినది. అదేమంత పెద్ద పరికరమూ కాదు.

వినువీధిలో భారత సత్తా చాటాలని మిస్సైల్​ మ్యాన్​.. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాం కన్న కల చంద్రయాన్​-1. అది పూర్తిగా సాకారమయ్యే దిశగా చంద్రయాన్​-2 ప్రయోగానికి సిద్ధమైంది.

ఇప్పుడెలా...

చంద్రయాన్​-1కు పెద్ద కొనసాగింపుగా చంద్రయాన్​-2 ప్రయోగాన్ని నిర్వహించ తలపెట్టింది ఇస్రో. అది సాధించని ఎన్నో ఘనతల్ని.. దీని ద్వారా సాధ్యం చేయాలనుకుంటోంది. నీటి జాడపై పూర్తి సమాచారం, జాబిల్లి పుట్టుక, ఆవాసానికి వీలుందా వంటి అంశాలపై లోతుగా విశ్లేషణ చేయనుంది.

చంద్రయాన్​-2 ఎలా పనిచేస్తుంది...?

చంద్రయాన్​-2లో మూడు భాగాలుంటాయి. దీని ద్వారా ఆర్బిటర్​, విక్రమ్(ల్యాండర్)​, ప్రగ్యాన్(రోవర్)​ను పంపనున్నారు.

''చంద్రుడి మీదకు భారత్​ ప్రయోగించిన చివరి మిషన్​తో పోలిస్తే.. ముందడుగు వేసింది ఇస్రో. అత్యాధునిక బరువైన పరికరాలతో ఆర్బిటర్​, ల్యాండర్​లను ప్రయోగిస్తోంది. ఈ ల్యాండర్ మృదువుగా జాబిల్లి ఉపరితలంపైకి దిగుతుంది. రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పూర్తి స్థాయిలో పరిశోధనలు చేస్తుంది.''
- రత్న శ్రీ, అంతరిక్ష రంగం నిపుణులు

దక్షిణ ధ్రువానికి తొలిసారి...

ఎన్నో దేశాలు చంద్రమండలంపై ప్రయోగాలు నిర్వహించినా.... ఏ రోవర్​ ఇంతవరకూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగలేదు. ఆ ఘనతను ఇస్రో సాధించనుంది.
చంద్రయాన్​-1 వ్యయం రూ. 386 కోట్లు కాగా.. చంద్రయాన్​-2 కోసం రూ. 978 కోట్లు వెచ్చిస్తున్నారు. చంద్రయాన్​-1 బరువు.. 1.38 టన్నులు కాగా.. ఇప్పటి మిషన్​ బరువు 3.8 టన్నులు.

''భారత్​ ప్రయోగించే చంద్రయాన్​-2 ఖర్చు మొత్తం 150 మిలియన్​ డాలర్లు. మీరు గమనిస్తే... నాసా చివరిసారిగా చంద్రునిపైకి పంపిన మిషన్​ ఖర్చు దీని కంటే 10 రెట్లు ఎక్కువే. అత్యంత తక్కువ వ్యయంతో, ప్రభావవంతమైన యంత్రాలతో ప్రయోగాలు చేయడం భారత్​కు తెలుసు. భారత ఇంజినీర్లు, భారత శాస్త్రవేత్తలు, ఇస్రో సామర్థ్యంతోనే ఇది సాధ్యమైంది.'' ​
- పల్లవ బగ్లా, విజ్ఞాన శాస్త్ర నిపుణుడు

ఆర్బిటర్​ పూర్తిగా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతుంది. సెప్టెంబర్​ 6 లేదా 7 తేదీల్లోగా 'ల్యాండర్'​.. చంద్రుడి ఉపరితలంపైకి మృదువుగా దిగుతుంది. అనంతరం.. అందులోంచి ప్రగ్యాన్​.. 'రోవర్'​ బయటికొచ్చి చంద్రుడిపై 14 రోజుల పాటు తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. స్వీయ పరికరాల ద్వారా.. సమాచారం, ఛాయా చిత్రాలను ఇస్రోకు పంపుతుంది.

ఇలా 3 వేర్వేరు దిశల్లో వేర్వేరు పనులు చేస్తుండే మూడింటినీ కలిపి ఏకకాలంలో ఒక వ్యోమనౌక కింద ప్రయోగిస్తుండటం వల్లే అత్యంత క్లిష్టంగా మారింది చంద్రయాన్​-2 ప్రయోగం. అందుకోసం.. చంద్రుడిపై పరిస్థితులను భూమ్మీదే కృత్రిమంగా సృష్టించి ట్రయల్స్​ నిర్వహించారు. అన్ని ఇబ్బందులూ, సవాళ్లను అధిగమించే విధంగా అత్యాధునిక యంత్ర పరికరాలతో.. చంద్రయాన్​-2 నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది.

ఇదీ చూడండి: ఫ్యాన్సీ నెంబర్ల మోజులో పడితే అంతే..!

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 14 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1552: Hong Kong IZONE Content has significant restrictions; see script for details 4220277
South Korean girlband IZ*ONE throws their first concert in Hong Kong
AP-APTN-1447: UK Duchess of Cambridge Wimbledon AP Clients Only 4220272
Duchess of Cambridge attends Wimbledon women's final
AP-APTN-1404: Thailand Buffalo Race AP Clients Only 4220265
Thai farmers celebrate sowing season with buffalo race
AP-APTN-1025: US NY Manhattanhenge AP Clients Only 4220248
NYC sees Manhattanhenge sunset
AP-APTN-1019: US Kim Yoon Seok Content has significant restrictions, see script for details 4220247
South Korean actor-director Kim Yoon-seok speaks about #MeToo movement in South Korea; says never wants to film a love scene
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 15, 2019, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.