ETV Bharat / bharat

దేశంలో సగం కరోనా కేసులు 5 నగరాల్లోనే.. - చెన్నైలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు మొత్తం 3 లక్షల మందికి పైగా వైరస్​ సోకినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో సగానికి పైగా దేశంలోని ప్రముఖ నగరాల్లోనే నమోదైనట్లు తెలిపింది. దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ , ఠానే​​, చెన్నై​లోనే అత్యధిక మంది బాధితులు ఉన్నట్లు వివరించింది.

India's five cities account for half of total Covid-19 cases
దేశంలో సగం కరోనా కేసులు 5 నగరాల్లోనే..
author img

By

Published : Jun 13, 2020, 4:43 PM IST

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో అమెరికా, బ్రెజిల్‌, రష్యాలతో పోటీపడుతున్న భారత్‌.. 3,08,993 కేసులతో అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉంది. ఇక దేశంలోని నగరాల్లో కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకరంగా పెరుగుతోంది. భారత్‌లో నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసుల్లో ఇంచుమించు సగం కేవలం ఐదు నగరాల నుంచే వస్తున్నాయని తెలిసింది. రాజధాని దిల్లీ (36,824), మహారాష్ట్రకు చెందిన ముంబయి (55,451), పుణె (11,000 పైన), ఠానే (సుమారు 16,000)లతో సహా గుజరాత్‌లోని అహ్మదాబాద్ (సుమారు 16,000)‌, తమిళనాడుకు చెందిన చెన్నై (సుమారు 27,000), రాజస్థాన్‌లోని జైపూర్‌ అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదైన నగరాల్లో కొన్ని. కాగా, ఈ గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

India's five cities account for half of total Covid-19 cases
దిల్లీలో
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 55,451 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు దేశంలోని ఏ నగరంలోనూ నమోదు కాలేదు. అంతేకాదు, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఈజిప్ట్‌, యూఏఈ తదితర దేశాల్లో కేసుల కంటే ఎక్కువ! ఈ ఒక్క నగరంలోనే ఇప్పటివరకూ 2,000 మందికి పైగా మృతి చెందారు.
  • రాజధాని దిల్లీలో కరోనా గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం 36,824 కేసులు నమోదు కాగా... వీరిలో మృతుల సంఖ్య 1214. 13,398 మంది చికిత్సానంతరం స్వస్థత పొందారు.
  • దక్షిణ భారత దేశంలో ప్రముఖ నగరం చెన్నైలో కూడా కొవిడ్‌ ముద్ర తీవ్రంగానే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో శనివారం నాటికి కేసులు 40,698 కాగా... వాటిలో ఏకంగా 70 శాతం చెన్నైలోనే ఉండటం గమనార్హం. 27,000కు పైగా కొవిడ్‌ కేసులతో ఆ నగరం కుదేలవుతోంది.
  • మహారాష్ట్రకే చెందిన మరో నగరం ఠానే. ప్రశాంతంగా ఉండే ఈ పట్టణం, 16,000 కు పైగా కొవిడ్‌-19 కేసుల నమోదుతో ఒక్కసారి వార్తల కెక్కింది. ఇప్పటివరకు థానేలో 400 మంది కరోనాకు బలయ్యారు.
  • వైశాల్యం ప్రకారం గుజరాత్‌లోనే అతి పెద్ద పట్టణం అహ్మదాబాద్. ఒకప్పటి రాజధాని కూడా అయిన అహ్మదాబాద్‌, ప్రస్తుతం కరోనా మహమ్మారికి నిలయంగా మారింది. శనివారం నాటికి గుజరాత్‌ మొత్తం మీద 22,527 కేసులు నమోదు కాగా... ఒక్క అహ్మదాబాద్‌లోనే సుమారు 16,000 కేసులు నమోదయ్యాయి.

గణాంకాలను బట్టి పై ఐదు నగరాలలో మొత్తం కరోనా కేసులు 1,51,000కు పైమాటే. అంటే దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో సగం.

ఇదీ చూడండి:అఫ్గాన్​లో మరో 2 దాడులు- 18 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.