ETV Bharat / bharat

అక్టోబర్​ 31న సీప్లేన్​ సేవల ప్రారంభం!

దేశంలో తొలి సీప్లేన్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్​ 31న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాల్దీవుల నుంచి భారత్​కు ఆదివారం చేరిన సీప్లేన్.. కెవాడియా మీదుగా అహ్మదాబాద్​కు సోమవారం వచ్చింది.​ సబర్మతి తీరం నుంచి పటేల్​ విగ్రహం వరకు రాకపోకలు సాగనున్నాయి.

India's first Seaplane arrives in Ahmedabad from Maldives
అక్టోబర్​ 31న సీప్లేన్​ సేవల ప్రారంభం!
author img

By

Published : Oct 27, 2020, 9:44 AM IST

దేశంలో తొలి సీప్లేన్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్​లోని నర్మదా జిల్లాలో, సబర్మతి నదీ తీరం నుంచి సర్దార్​ పటేల్​(ఐక్యతా) విగ్రహం వరకూ ఈ సేవలు అందించనున్నారు. 19-సీట్లున్న 'ట్విన్​ ఒట్టర్​-300' సీప్లేన్​ మాల్దీవులు లోని మాలే నుంచి భారత్​కు ఆదివారం చేరింది. గుజరాత్​లోని అహ్మదాబాద్​కు ఇద్దరు విదేశీ పైలట్లతో సోమవారం చేరుకుంది.

నీటి పైనుంచే ఎగిరి, నీటిపైనే దిగే ఈ విమానంలో 12 మంది ప్రయాణికులను అనుమతిస్తారు. సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ఈనెల 31న సీప్లేన్​ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర నౌకా రవాణాశాఖ సహాయ మంత్రి మన్​సుఖ్​ మండావియా సోమవారం చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.