దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారు 3,04,043 మంది ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.
ఇప్పటివరకు 6,77,422 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 23,672మంది మహమ్మారిని జయించారు. రోజువారీ రికవరీల్లో ఇదే ఇప్పటివరకు అత్యధికం. ఫలితంగా రికవరీ రేటు 62.86శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 3,73,379మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సకాలంలో వైరస్ నిర్ధరణకు తీసుకున్న క్రియాశీలక నియంత్రణ చర్యలు, సమయానికి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం, పరీక్షలు ఎక్కువగా జరపడం, సమయానికి చికిత్స అందించడం, మోస్తరు-తీవ్రమైన కేసుల విషయంలో సమర్థమైన చికిత్స వల్ల రికవరీ రేటు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ.
ఇదీ చూడండి: 'మహా' విలయం- ఒక్కరోజులో 9,518 కేసులు