ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 452కు చేరిన మరణాలు

author img

By

Published : Apr 17, 2020, 7:31 PM IST

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 13,800 దాటింది. 452 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India's COVID-19 cases surge to 13,835
దేశంలో 452కు చేరిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 452 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో 1,076 కొత్త కేసులు, 32 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

India's COVID-19 cases surge to 13,835
భారత్​లో కరోనా ప్రభావం ఇలా

వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో..

  • మహారాష్ట్రలో కొత్తగా 36 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 3,236కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 23 మంది పుణెకు చెందినవారు కావడం గమనార్హం.
  • గుజరాత్​లో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1000 మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. శుక్రవారం ఇద్దరు మృతి చెందగా.. మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 38కి చేరింది.
  • కర్ణాటకలో ఇవాళ 38 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్​ బాధితుల సంఖ్య 353కు పెరిగింది. ఒక్కరోజులో అత్యధిక కేసులు నిర్ధరణ కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 82 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
  • రాజస్థాన్​లోనూ కరోనా విజృంభిస్తోంది. నేడు కొత్తగా 62 పాజిటివ్​ కేసులు గుర్తించారు. వైరస్​తో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తి మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 17కు చేరింది.
  • హరియాణాలోని నూహ్ జిల్లాలో 5​, పంచకులాలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలగా.. రాష్ట్రంలో వైరస్​ సోకిన వారి సంఖ్య 221కి పెరిగింది.
  • అండమాన్​ నికోబార్​ దీవిలో పూల్​ టెస్టింగ్​లో తొలి కరోనా కేసు గుర్తించారు అధికారులు. పూల్​ టెస్టింగ్​ నిర్వహించిన నేపథ్యంలో ఓ ప్రభుత్వ అధికారికి పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. అతని కుటుంబంలోని 9 మందిని క్వారంటైన్​కు పంపినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.