ETV Bharat / bharat

'ఆ లెక్కన చూస్తే భారత్​లో కేసులు అత్యల్పమే' - భారత జనాభా

ప్రపంచ దేేశాలతో పోల్చుకుంటే భారత్​లో.. లక్ష జనాభా ప్రాతిపదికన చూస్తే కరోనా వైరస్​ కేసులు తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అధిక జనాభా కలిగిన భారత్​కు ఇది సానుకూల అంశమని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించింది.

India's COVID-19 cases per lakh population among lowest in world: Health Ministry
లక్ష జనాభా ప్రాతిపదికన.. భారత్​లో కేసులు అత్యల్పం
author img

By

Published : Jun 22, 2020, 5:44 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో దీని విస్తరణ చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచ దేశాల్లో సగటున లక్ష జనాభా ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే, భారత్‌లో అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించింది.

"భారత్‌లో ఒక లక్ష జనాభాకు 30.04 కరోనా కేసులు ఉండగా, ప్రపంచ దేశాల్లో సగటు మూడు రెట్లు.. అంటే 114.67 మంది కరోనాతో బాధపడుతున్నారు" అని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికాలో లక్ష జనాభాకు 671.24 మంది కరోనా బారిన పడగా ఆ తర్వాత.. జర్మనీ (583.88), స్పెయిన్ (526.22)‌, బ్రెజిల్‌ (489.42) దేశాలు ఉన్నాయి.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా నియంత్రణలో తీవ్రంగా కృషి చేస్తున్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

తాజాగా 14,821 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణయింది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. వీరిలో 2,37,195 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 9,440 మంది కోలుకున్నారు. 1,75,387 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ దెబ్బకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో 445 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 13,699కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1,43,267 కరోనా నిర్ధరణ పరీక్షలు జరిపారు.

ఇదీ చూడండి:- బస్సుల్లో భౌతిక దూరానికి భరోసా ఏది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.