భార్యపై అనుమానంతో జనాలు చూస్తుండగానే దాడికి పాల్పడి కత్తితో పొడిచి చంపాడో భర్త. పని నిమిత్తం దుబాయ్‌లో ఉన్న భార్యను కలిసేందుకు పర్యటన వీసాపై వెళ్లి ప్రాణాలు తీశాడు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం.. విచారణలో ఉన్న వ్యక్తి గతేడాది సెప్టెంబర్ 9న అల్-క్వాజ్ పారిశ్రామిక ప్రాంతంలోని తన భార్య కార్యాలయంలోకి వెళ్లాడు. తన భార్యకు, ఆమె మేనేజర్ నుంచి వచ్చిన సందేశంపై ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. కార్యాలయం బయటికి రాగానే.. కత్తితో దాడికి దిగాడు.
ఆమె పారిపోవాలని ప్రయత్నించినా.. వెంబడించి ఈ దారుణానికి ఒడి గట్టాడని తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పారిపోవాలని చూడగా పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
వీరికి భారత్‌లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చదవండి: రామాయణం థీమ్‌తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!