ETV Bharat / bharat

భారత శాస్త్రవేత్తల సృష్టి.. పర్యావరణహిత లిథియం బ్యాటరీలు - లిథియం సల్ఫర్​ బ్యాటరీస్​

తక్కువ ధరలో ఎక్కువ శక్తిని నిల్వ చేసే లిథియం-సల్ఫర్​ బ్యాటరీలను బాంబే ఐఐటీ, శివ్​ నాడర్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవని చెప్పారు.

indian scientists invented lithium-sulphur  battery
భారత శాస్త్రవేత్తల పర్యావరణ అనుకూల లిథియం బ్యాటరీలు
author img

By

Published : Aug 24, 2020, 8:46 AM IST

ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న లిథియం-అయాన్​ బ్యాటరీల కన్నా చౌకగా.. ఎక్కువ శక్తిని నిల్వ చేసే లిథియం-సల్ఫర్​ బ్యాటరీలను భారత పరిశోధకులు తయారు చేశారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవని చెప్పారు. బాంబే ఐఐటీ, శివ్​ నాడర్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

ల్యాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్లు, స్మార్ట్​ వాచీలు, విద్యుత్​ కార్లకు లిథియం-అయాన్​ బ్యాటరీలే ఆధారం. అయితే ఇంధన నిల్వ విషయంలో అవి సమర్థమైనవి కావు. అవి చాలా బరువు ఉంటాయి. ఖరీదు కూడా ఎక్కువ. ఈ బ్యాటరీలను రీసైకిల్​ చేయడం కష్టం. వాటికి మండే స్వభావం కూడా ఉంది. ఇందుకు భిన్నంగా తాము రూపొందించిన లిథియం-సల్ఫర్​ బ్యాటరీలో పర్యావరణ అనుకూల విధానాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో పెట్రోలియం పరిశ్రమలో వెలువడే సల్ఫర్​, వ్యవసాయ వ్యర్థాలు, జీడిపప్పు ప్రాసెసింగ్​లో వెలువడే కార్డనాల్​ వంటి కోపాలీమర్లు, ఈజెనాల్​ తదితరాలను ఉపయోగించామన్నారు. ఇలాంటి బ్యాటరీలపై ఎక్కువగా ఆధారపడే టెక్​ ఉపకరణాలు, డ్రోన్లు, విద్యుత్​ వాహనాలకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. ఈ తరహా బ్యాటరీలకు మూడు రెట్లు ఎక్కువ ఇంధన సాంద్రత ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు చేతికి‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.