ETV Bharat / bharat

భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత

author img

By

Published : Aug 25, 2020, 11:24 AM IST

భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత సాధించింది. భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి అతినీలలోహిత కాంతిని కనుగొన్నట్లు ఐయూ సీఏఏ తెలిపింది. ఐదు ప్రత్యేకమైన ఎక్స్‌రే, అతినీలలోహిత టెలిస్కోప్‌లను కలిగి ఉన్న భారత మొట్టమొదటి బహుళ తరంగ దైర్ఘ్య ఉపగ్రహం ఆస్ట్రోసాట్.

Indian satellite AstroSat makes rare discovery
భారత ఉపగ్రహం ఆస్టోసాట్ అరుదైన ఘనత

భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతినీలలోహిత కాంతిని గుర్తించింది భారతదేశ మొట్ట మొదటి బహుళ-తరంగదైర్ఘ్య ఉపగ్రహం ఆస్ట్రోసాట్. ఈ మేరకు పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్​ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్​(ఐయూసీఏఏ) విభాగం ప్రకటన విడుదల చేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న అంతర్జాతీయ బృందానికి భారత శాస్త్రవేత్త డా.కనక్​ సాహ నేతృత్వం వహించారు. ఈ బృందంలో ఫ్రాన్స్​, స్విట్జర్లాండ్​, జపాన్​, అమెరికా, నెదర్లాండ్స్​ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు 'నేచర్​ ఆస్ట్రానమీ' జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

ఆ ఆస్ట్రోనాట్​ ఉపగ్రహం ఐదు ప్రత్యేకమైన ఎక్స్‌రే, అతినీలలోహిత టెలిస్కోప్‌లను కలిగి ఉంటుంది. ఈ పరిశీలన 2016లో 28 గంటలపాటు జరిగినప్పటికీ పాలపుంత నుంచే అతినీల లోహిత కాంతి వెలువడిందా? అని విశ్లేషించేందుకు ఇంత సమయం పట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కాంతిని గతంలో నాసాకు చెందిన హబుల్​ స్పేస్​ టెలిస్కోప్ గుర్తించలేకపోయిందని చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలను తమ ఆవిష్కరణ నిజమని ఒప్పించడం కొంచెం కష్టమేన్నారు.

అతినీలలోహిత కాంతి జాడ తెలుసుకోవడం అత్యంత కీలకమైన విషయమన్నారు ఐయూసీఏఏ డైరెక్టర్​ డా.సోమక్​ రాయ్ ​చౌదరి. విశ్వం చీకటి యుగాలు ఎలా ముగిశాయి, విశ్వంలో కాంతి ఎలా ఉంది ఇది ఎప్పుడు ప్రారంభమైందనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. కాంతి ప్రారంభ మూలాలను కనుగొనడం అత్యంత క్లిష్టమని చెప్పారు. తమ బృందం సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల గర్వంగా ఉందన్నారు సోమక్.

ఇదీ చూడండి: వెదురు పొదరిల్లు- పక్షులు, పాములే కుటుంబ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.