ETV Bharat / bharat

యుద్ధనౌకల మోహరింపుతో చైనాకు గట్టి హెచ్చరిక!

సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో భారీగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు మోహరించి చైనాకు గట్టి హెచ్చరికలు పంపింది భారత్​. డ్రాగన్​పై ఒత్తిడి పెంచేలా మలాక్కా జలసంధి వద్ద భారీగా మోహరింపులు చేసినట్లు పేర్కొంది.

Indian Navy's clear message to Beijing
ఐఓఆర్​లో భారీగా యుద్ధనౌకల మోహరింపు
author img

By

Published : Jul 29, 2020, 5:42 AM IST

లద్దాఖ్​లో సరిహద్దు వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా వెన్నులో వణుకుపుట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది భారత్​. ఈ క్రమంలోనే హిందూ మహాసముద్ర జలాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరించి డ్రాగన్​కు గట్టి హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో భారత్​ పంపిన సందేశం చైనాకు చేరిందని.. రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

" గల్వాన్​ లోయలో జూన్​ 15న జరిగిన ఘర్షణతో చెలరేగిన సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో భారత వైఖరిపై చైనాకు స్పష్టమైన సందేశం పంపేందుకు.. హిందూ మహాసముద్రంలో యుద్ధనౌకలు, జలాంతర్గాములు మోహరించింది భారత నౌకాదళం. సరిహద్దులో పరిస్థితులపై సమన్వయం సహా భారత వైఖరిని చైనా అర్థం చేసుకునేలా చేసేందుకు త్రివిధ దళాల అధినేతలు దాదాపు ప్రతిరోజు చర్చల్లో పాల్గొంటున్నారు. సముద్ర మార్గాల ద్వారా సరఫరా గొలుసులో చైనాకు మలాక్కా జలసంది కీలకం. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఈ జలసంధి చుట్టూ యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరిస్తూ నావికాదళం తన విస్తరణను గణనీయంగా పెంచింది. "

- రక్షణ శాఖ వర్గాలు.

భారత్​ బలగాల మోహరింపుపై చైనా స్పందిస్తోందా అని అఢిగిన ప్రశ్నకు బదులుగా.. 'అవును, యుద్ధనౌకల మోహరింపు సందేశం చైనాకు చేరింది' అని పేర్కొన్నారు అధికారులు. కానీ, చైనా వైపు అదనపు నౌకల మోహరింపు వంటి చర్యలు కనిపించలేదన్నారు.

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.