పోరాట సన్నద్ధతను మరింత మెరుగుపర్చుకునే దిశగా భారత నావికాదళం కీలకనిర్ణయం తీసుకుంది. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే 38 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను యుద్ధనౌకల్లో మోహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రక్షణశాఖకు ప్రతిపాదనలు పంపించింది.
ఇందుకోసం నావికాదళం 18వందల కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది.
విశాఖపట్నంలో రూపుదిద్దుకుంటున్న అధునాతన యుద్ధ నౌకల్లో ఈ బ్రహ్మోస్ క్షిపణులను మోహరించనున్నారు. ఇప్పటికే ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది నావికాదళం.
ఇదీ చదవండి: నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం