ETV Bharat / bharat

'భారత్​-పాక్​ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు' - గణతంత్ర వేడుకలు రద్దు వాఘా సరిహద్దులో

రిపబ్లిక్​ డే (జనవరి 26) రోజున భారత్​- పాక్​ సరిహద్దు అయిన వాఘా వద్ద ఎలాంటి వేడుకలు ఉండవని బీఎస్ఎఫ్ వర్గాల వెల్లడించాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Indian Embassy in China restricts R-Day flag hoisting ceremony to staff due to COVID-19 measures
'భారత్​-పాక్​ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు'
author img

By

Published : Jan 18, 2021, 1:42 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున ఏటా భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వాఘా వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈ సారి రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. వాఘా సరిహద్దుల్లో ఏటా నిర్వహించే రీట్రీట్ కార్యక్రమాన్ని ఈ సారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మహమ్మారి కారణంగా సాధారణ ప్రజలకు అనుమతిని రద్దు చేశారు.

భారత సరిహద్దు దళం, పాకిస్థాన్​ రేంజర్స్ సైనికులు మధ్య 1959 నుంచి ఉమ్మడిగా రీట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా వాఘా సరిహద్దు వద్ద కార్యక్రమాలను గత ఏడాది మార్చి 7 నుంచి నిలిపివేశారు.

సిబ్బందికే అనుమతి ..

బీజింగ్​ నగరంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా చైనాలోని భారత దౌత్య కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలను కేవలం సిబ్బంది వరకే పరిమితం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి : రైతుల 'రిపబ్లిక్​ డే' ర్యాలీపై నేడు సుప్రీం విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.