జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. మంగళవారం రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో ఎల్ఓసీ వెంబడి భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఎల్ఓసీ వెంబడి ఉన్న గ్రామాలు, పౌరులే లక్ష్యంగా పాక్ సైన్యం ఇటీవల కాల్పులకు తెగబడుతున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సతీందర్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భారత సైన్యం తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.