జమ్ముకశ్మీర్‌లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేయాలనే పాకిస్థాన్ కుట్రను భగ్నం చేశారు భద్రతా సిబ్బంది. ఉగ్రవాదుల సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఆయుధాలను కశ్మీర్లోకి చేరవేసేందుకు ఆ దేశ సైన్యం ప్రయత్నించినట్లు తంగ్ధార్ సెక్టార్ వద్ద విధులు నిర్వహిస్తున్న బలగాలు తెలిపాయి.
సోమవారం సాయంత్రం నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలను గుర్తించినట్లు సైన్యం అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలం నుంచి 5 పిస్టల్స్, 135 రౌండ్ల బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.
కశ్మీర్లోకి ఉగ్రవాదుల సాయంతో ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు పాక్ ప్రయత్నించడం గత ఐదు రోజుల్లో ఇది రెండోసారి.