పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని పటిష్ఠం చేయడంపై దృష్టిసారించింది భారత్. ఈ క్రమంలో స్వదేశీ ఆయుధాల తయారీని ప్రొత్సహిస్తోంది. దీనిలో భాగంగా కర్ణాటక బెంగళూరులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కాంబాట్ హెలికాప్టర్(ఎల్సీహెచ్)ను భారత వైమానిక దళాధిపతి భదౌరియా పరీక్షించారు. 45 నిమిషాలు ఎల్సీహెచ్లో గాల్లో చక్కర్లు కొట్టారు.
సమీప భవిష్యత్తులో ఎల్సీహెచ్ను భారత రక్షణ దళాలలో చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'ఆయుష్మాన్ భారత్' కేంద్రాల్లో 28కోట్ల మందికి సేవలు