రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన నాటి పరిస్థితిని గుర్తుపెట్టుకోవాలన్నారు. తన వైఖరిని మార్చుకోకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు బంగ్లాదేశ్ మాదిరిగానే తిరుగుబాటు చేస్తారని వ్యాఖ్యానించారు.
"1971లో పాకిస్థాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పడింది. మీరు తప్పును పునరావృతం చేయకండి. అలా కాకపోతే ఆక్రమిత కశ్మీర్లో ఏం జరగుతుందో చూడండి."
--- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ స్మారకార్థం రాజస్థాన్‌లోని ధాన్క్యా గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఇప్పుడు ఎలా ఉంటుందో...'
బాలాకోట్ దాడుల్లో పాకిస్థాన్‌కు, ఆ దేశ సైన్యానికి ఎలాంటి హానీ జరగకుండా భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని.. కానీ ఇప్పుడు దాయాది దేశం తన తీరును మార్చుకోకపోతే.. పరిస్థితులు మారవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజ్‌నాథ్. భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: జులైలో భారీగా పెరిగిన ఉద్యోగాలు..!