ETV Bharat / bharat

'5 కోట్ల కొవిషీల్డ్ టీకాలు సిద్ధం- అనుమతి రాగానే పంపిణీ' - Serum Institute of India vaccine news

కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాకు సిద్ధమని సీరం ఇనిస్టిట్యూట్‌ అధినేత అదర్ పూనావాలా చెప్పారు. తమ వద్ద 4 నుంచి 5 కోట్ల డోసుల టీకా నిల్వ ఉన్నట్లు తెలిపాారు. డీసీజీఐ అనుమతి లభించిన వెంటనే భారత ప్రభుత్వం ఎన్ని డోసులు కావాలో చెబితే నిల్వ నుంచి పంపిణీ చేస్తామన్నారు.

india-to-roll-out-covid-19-vaccine-in-january
'5 కోట్ల కొవిషీల్డ్ టీకాలు సిద్ధం- అనుమతి రాగానే పంపిణీ'
author img

By

Published : Dec 28, 2020, 9:05 PM IST

కేంద్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి రాగానే ఆస్ట్రాజెనికా-ఆక్సఫర్డ్‌ వర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ అధినేత అదర్ పూనావాలా చెప్పారు. తమ వద్ద 4 నుంచి 5 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ఎన్ని డోసులు కావాలో చెబితే నిల్వ నుంచి పంపిణీ చేస్తామన్నారు.

2021 జులై నాటికి 30కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తామని పునావాలా వెల్లడించారు. కొవిడ్ టీకా పంపిణీ, పర్యవేక్షణ కూటమి కొవాక్స్‌లో భారత్‌ కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. సీరమ్‌ సంస్థ ఉత్పత్తి చేసే టీకా డోసుల్లో 50శాతం భారత్‌కు, కొవాక్స్‌ కూటమికి ఏకకాలంలో కేటాయిస్తామని చెప్పారు. భారత్‌లో జనాభా చాలా ఎక్కువ కాబట్టి 5 కోట్ల డోసులను ముందుగా భారత్‌కే అందజేస్తామని స్పష్టంచేశారు.

2021 మొదటి 6 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ టీకా కొరత ఉంటుందని అదర్ పునావాలా చెప్పారు. ఆ విషయంలో ఎవరూ ఏమీచేయలేరని అన్నారు. అయితే వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నాటికి ఇతర ఉత్పత్తిదారుల టీకాలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి పరిస్థితి మెరుగుపడుతుందని అదర్ పునావాలా అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: బుధవారం రైతు సంఘాలతో కేంద్రం చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.