ETV Bharat / bharat

భానుడి భగభగలు- 3 రాష్ట్రాల్లో రెడ్​ అలర్ట్​ - పాండిచ్చెరిలో ఉష్ణోగ్రతలు భారత వాతావరణ శాఖ వార్తలు

imd red altert
మండుతున్న ఎండలు.. పంజాబ్​, హరియాణా, దిల్లీలో రెడ్​ అలర్ట్​
author img

By

Published : May 24, 2020, 2:12 PM IST

Updated : May 24, 2020, 2:41 PM IST

14:32 May 24

దేశంలో ఎండలు ఠారెత్తిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్​, హరియాణా, దిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).

దిల్లీలో మే 26న గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది.

ఎడారి ప్రాంతమైన రాజస్థాన్​లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బికనీర్​లో 45 డిగ్రీల సెల్సియస్​ గరిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని అంచనా వేసింది. చురులో ఆదివారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది.

మే 30 వరకు పుదుచ్చెరిలో 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది.

14:07 May 24

మండుతున్న ఎండలు.. పంజాబ్​, హరియాణా, దిల్లీలో రెడ్​ అలర్ట్​

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్​, హరియాణా, దిల్లీలో రెడ్​ అలర్ట్​ జారీ చేసింది భారత వాతావరణ విభాగం(ఐఎండీ).

Last Updated : May 24, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.