ETV Bharat / bharat

మసీదుగా గురుద్వారా.. భారత్ అభ్యంతరం - indo pak gurudwara dispute

దాయాది పాకిస్థాన్​లోని ప్రముఖ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు ప్రయత్నించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్​లోని పాక్ హైకమిషనర్ వద్ద ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గురుద్వారాను మసీదుగా మార్చే యత్నాలను అడ్డుకోవాలని సూచించింది.

gurudwara
పాక్​లో గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నం.. భారత్ తీవ్ర అభ్యంతరం
author img

By

Published : Jul 28, 2020, 7:19 AM IST

Updated : Jul 28, 2020, 8:42 AM IST

పాకిస్థాన్​ లాహోర్​లోని ఓ గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత్​లోని పాక్ హైకమిషనర్​ వద్ద నిరసన వ్యక్తం చేసింది.

"లాహోర్​లోని షాహిదీ అస్థాన్ గురుద్వారాను మసీదుగా మార్చే యత్నాలపై పాకిస్థాన్ హైకమిషనర్​ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. భాయ్ తారుసింగ్ జీ ప్రాణత్యాగం చేసిన ప్రదేశమైన ఈ గురుద్వారాను షాహిద్ గంజ్​గా పేర్కొంటు మసీదుగా మార్చేందుకు యత్నిస్తోంది పాక్."

-అనురాగ్ శ్రీవాత్సవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

భారత అభ్యంతరాలను.. తీవ్రమైన పదజాలంతో తెలిపినట్లు పేర్కొన్నారు శ్రీవాత్సవ. దీనిపై విచారణ చేపట్టి నివారణ చర్యలను చేపట్టాలని పాక్​ను కోరినట్లు చెప్పారు. పాక్​లోని దేశంలోని మైనారిటీల రక్షణ, మత హక్కులు, సంస్కృతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు దాయాది దేశం వివరించినట్లు వెల్లడించారు.

1,745 సంవత్సరంలో భాయ్ తారుజీ ప్రాణత్యాగం చేసిన ఈ గురుద్వారా అత్యంత ప్రముఖ గురుద్వారాల్లో ఒకటని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఒడిశాలో 'కొవాగ్జిన్​​' క్లినికల్​ ట్రయల్స్

Last Updated : Jul 28, 2020, 8:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.