ETV Bharat / bharat

భారత్​లో ప్రతీ లక్షమందికి ఒక్కటే కరోనా మరణం!

author img

By

Published : Jun 23, 2020, 6:47 PM IST

భారత్​లో ప్రతి లక్షమందిలో కరోనాతో ఒక్కరే మృతి చెందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది ప్రపంచ సగటుతో పోల్చుకుంటే చాలా తక్కువని స్పష్టం చేసింది. సకాలంలో వైరస్​ బాధితులను గుర్తించడం, సమర్థమైన చికిత్స అందించడం వల్లే వైరస్​ మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది.

India has 1 COVID-19 death per lakh population as against 6.04 globally: Health ministry
భారత్​లో ప్రతీ లక్షమందికి ఒక్కటే మరణం!

కరోనా మరణాలు.. ప్రపంచ సగటుతో పోల్చుకుంటే భారత్​లో అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో ప్రతి లక్షమందిలో సగటున 6.04 మంది చొప్పున మరణాలు నమోదవుతుంటే.. భారత్​లో ఒక్కరు మాత్రమే మరణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని అతికొద్దిదేశాల ఈ జాబితాలో భారత్​ నిలిచిందని స్పష్టం చేసింది.

వైరస్​ బాధితులను సకాలంలో గుర్తించడం, విస్తృతమైన కాంటాక్ట్​ ట్రేసింగ్, సమర్థమైన క్లినికల్​ నిర్వహణ ఫలితంగానే తక్కువ ​మరణాలు నమోదవుతున్నాయని అధికారులు వివరించారు.

ప్రపంచ దేశాల్లో ఇలా!

జూన్​ 22న ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి లక్షమందిలో కరోనా మరణాలు బ్రిటన్​లో 63.13, స్పెయిన్​లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీ 27.32, బ్రెజిల్​లో 23.68, రష్యాలో 5.62గా ఉన్నాయి.

రికవరీ శాతం పెరుగుతోంది!

కొవిడ్​-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని.. ప్రస్తుతం భారత్​లో 56.38 శాతం మంది రికవరీ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు 2,48,189 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 1,78,014 మంది చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఐసీఎంఆర్ గణాంకాల​ ప్రకారం.. జూన్​ 22 వరకు దేశవ్యాప్తంగా 71,37,716 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 14,011 మంది కరోనాతో మరణించారు.

కేసుల్లో 4.. మరణాల్లో 8..

వైరస్​ కేసుల నమోదులో అమెరికా, బ్రెజిల్​, రష్యా తర్వాత ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది భారత్​. జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ గణాంకాల ప్రకారం.. మరణాల్లో ఎనిమిదో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: భాజపా X కాంగ్రెస్​: వైఫల్యమా? పైశాచికత్వమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.