ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్ 13వ స్థానంలో ఉందని ఓ నివేదిక తెలిపింది. 189 దేశాల్లో నీటి ఎద్దడి, కరవు, వరదల ముప్పు అంశాలపై సర్వే చేసింది ప్రపంచ వనరుల సంస్థ.
ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్లో ఉంది. నీటి సంక్షోభం ఎదుర్కొంటున్న ఇతర 16 దేశాలతో పోలిస్తే భారత్లో 3 రెట్లు అధిక జనాభా ఉందని నివేదిక పేర్కొంది. ఉత్తర భారత దేశంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకుపోయాయి.
చెన్నైలో ఇటీవల తలెత్తిన నీటి సంక్షోభం ప్రపంచం దృష్టికి వెళ్లింది. భారత్లోని వివిధ ప్రాంతాలు దీర్ఘకాల నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు భారత జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాతావరణంలో జరిగే మార్పులే ఇలాంటి భయంకర పరిణామాలకు దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, మున్సిపాలిటీలు ఏటా దాదాపు 80 శాతం నీటి వనరులను వినియోగించుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి:'ఆర్టికల్ 370'.... అయ్యంగార్ విరచితం!