భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొత్తగా రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 606 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

- మహారాష్ట్రలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కి చేరింది. 10,928 మంది వైరస్కు బలయ్యారు.
- తమిళనాడులో కేసులు 1,51,820కి చేరాయి. 2,167 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొవిడ్ బాధితుల సంఖ్య 1,16,993గా ఉంది. మొత్తంగా 3,487 మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 44,552 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. 2,079మంది కరోనా కారణంగా చనిపోయారు.
ఇదీ చూడండి: నయీం నుంచి దుబే వరకు అవే ప్రశ్నలు