దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 5,134 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,296 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,17,121కి, మరణాలు 9,250కి చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 1,18,558 మంది కోలుకున్నారు. 89,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. నేడు 3,616 కొత్త కేసులు నిర్ధరణయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,18,594కు చేరగా.. మరణాలు 1,636కు పెరిగాయి. 45,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దిల్లీలో..
దిల్లీలో ఇవాళ 2,008 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,02,831కి, మరణాల సంఖ్య 3,165కి చేరింది.
కేరళలో మళ్లీ విజృంభణ
కేరళలో కొద్ది రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ 272 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,894కు చేరింది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా
రాష్ట్రం | కొత్త కేసులు | కొత్త మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
మహారాష్ట్ర | 5,134 | 224 | 2,17,121 | 9,250 |
తమిళనాడు | 3616 | 65 | 1,18,594 | 1,636 |
దిల్లీ | 2,008 | 50 | 1,02,831 | 3,165 |
కర్ణాటక | 1,498 | 15 | 26,815 | 416 |
మధ్యప్రదేశ్ | 343 | 5 | 15,627 | 622 |
ఉత్తరాఖండ్ | 69 | 0 | 3,230 | 43 |
మణిపుర్ | 40 | 0 | 1,430 | 0 |
కేరళ | 272 | 2 | 5,894 | 27 |
లద్దాఖ్ | 36 | 0 | 180 | 1 |