ETV Bharat / bharat

నేడు భారత్​-చైనా మధ్య సరిహద్దు చర్చలు

author img

By

Published : Aug 20, 2020, 7:39 AM IST

Updated : Aug 20, 2020, 8:26 AM IST

తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా దేశాలు గురువారం డబ్ల్యూఎంసీసీ సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి.

INDIA-CHINA-LIKELY-TO-HOLD-ANOTHER-WMCC-MEETING
భారత్​-చైనా మధ్య సరిహద్దు చర్చలు

భారత్​-చైనా దేశాలు గురువారం వర్కింగ్ మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశాన్ని నిర్వహించనున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతల తగ్గింపు, తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో అధికారులు చర్చించనున్నారు.

గత నెలలో జరిగిన డబ్ల్యూఎంసీసీ 17వ సమావేశంలో.. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల సత్వర ఉపసంహరణకు అంగీకరించారు. ఇరువైపులా సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

మే నెల నుంచి భారత్​పై చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. జూన్​ 15న జరిగిన గల్వాన్​ లోయ హింసాత్మక ఘటన అనంతరం ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయితే సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నాయి. కానీ సైనిక, దౌత్య స్థాయిల్లో సమావేశమైనప్పటికీ.. ఫింగర్​ ప్రాంతం, డెప్సంగ్​, గోగ్రాల నుంచి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించడం లేదు. బలగాలను వెనక్కి పిలిపించుకుని.. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు చైనా సహకరించాలని భారత్​ పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి: సరిహద్దులో చైనా అధునాతన యుద్ధ విమానాలు

Last Updated : Aug 20, 2020, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.