ETV Bharat / bharat

గాల్వన్​ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది? - భారత్​ చైనా తాజా వార్తలు

భారత్​ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన హింసకు దారితీసింది. గాల్వన్ లోయలో జరిగిన బాహాబాహీలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత భూభాగంలో చైనా తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేయటమే ఘర్షణకు దారి తీసిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.

india-china
భారత్​ చైనా సరిహద్దు
author img

By

Published : Jun 17, 2020, 5:35 AM IST

భారత్​-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న గాల్వన్​ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగటం వల్ల కల్నల్ సంతోష్​ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. మరో పది మంది గల్లంతైనట్లు సమాచారం.

"వాస్తవాధీన రేఖ దాటి భారత​ భూభాగంలో చైనా కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. కమాండింగ్ అధికారి నేతృత్వంలోని భారత సైన్యం వాటిని ధ్వంసం చేసింది. మొదట పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) సైనికులు వెనుదిరిగారు. కానీ హఠాత్తుగా 1000మంది చైనా సైనికులు ముందుకు వచ్చారు. భారత్​వైపు కూడా 1000మంది జవాన్లు ఉన్నారు. నదీ ప్రాంతంలో ఈ ఘర్షణ తలెత్తడం వల్ల చాలా మంది సైనికులు నదిలో పడిపోయారు."

- సైనికాధికారి

అయితే ఘర్షణ సమయంలో రెండు దేశాల సైనికులు ఒక్క తుపాకీ పేలలేదని.. ముఖాముఖి యుద్ధానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాళ్లు విసురుకోవటం, ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరికి బుల్లెట్​ గాయాలు ఉన్నాయని చెబుతున్నా దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు.

ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనాతో చర్చిస్తున్న బృందంలో కల్నల్​ సంతోష్ బాబు కూడా ఉన్నారు.

చైనా సైనికులూ..

చైనా వైపున కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరణించినవారు, గాయపడ్డవారు దాదాపు 43 మంది ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ సైనికుల మరణానికి సంబంధించి చైనా అధికారిక ప్రకటనేదీ చేయలేదు. 1975 తర్వాత భారత్​- చైనా సరిహద్దుల్లో ప్రాణనష్టం సంభవించటం ఇదే తొలిసారి.

ప్రాథమిక సమాచారం మేరకు గాల్వన్​ లోయలోని గస్తీ పాయింట్​- 14 వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయి అధికారుల సమావేశంలో అంగీకరించిన నిర్ణయాలను అమలుపై చర్చించారు.

ప్రతిష్టంభన..

వాస్తవాధీన రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో నెల రోజులకుపైగా రెండు అతిపెద్ద సైనిక దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్ధాఖ్​లోని ప్యాంగాంగ్ సరస్సు, గాల్వన్​ లోయ, హాట్​స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాలు వందల సంఖ్యలో అదనపు బలగాలతోపాటు భారీ వాహనాలు, ఆర్టీలరీ గన్స్​ను మోహరించాయి.

ఈ కారణాలే రెండు అణ్వాయుధ దేశాల మధ్య హింసాత్మక పరిస్థితులకు దారి తీశాయి. తొలుత మే 5న ప్యాంగాంగ్​ సరస్సు ప్రాంతంలో బాహాబాహీకి దిగటం వల్ల 75 మంది సైనికులు గాయపడ్డారు. గాల్వన్​ లోయలో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని చైనా చెబుతోంది. ఎందుకంటే లోయలో సరిహద్దు ఎక్కడ ఉందన్న అంశంపై స్పష్టత లేదు.

వెనుదిరిగిన బలగాలు..

ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.. ఉద్రిక్తతలు తగ్గించేందుకు బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనాతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మంగళవారం చెప్పారు. గాల్వన్ లోయలో ఇరు వర్గాలు వెనక్కు వెళుతున్నాయని స్పష్టం చేశారు.

మరింత జటిలం..

గాల్వన్ వ్యాలీ ప్రాంతంపై చైనా ఎల్లప్పుడూ సార్వభౌమత్వాన్ని కలిగి ఉంటుందని పీఎల్​ఏ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్​ ఝాంగ్ షూయూలీ మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్​ టైమ్స్ వెల్లడించింది. ఇదే నిజమైతే భారత్​- చైనా సరిహద్దు వివాదం మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది.

కారాకోరం కనుమ సమీపంలో ఉన్న కీలకమైన దౌలత్​ బేగ్ ఓల్డీ వైమానిక స్థావరం ప్రపంచంలో అతి ఎత్తయినది. షాయోక్​ నుంచి దౌలత్​ బేగ్​ ఓల్డీని కలుపుతూ నిర్మిస్తున్న 255 కి.మీ రహదారి గాల్వన్​ మీదుగా వెళుతుంది. భారత్​కు సంబంధించి గాల్వన్​ లోయ కూడా కీలకంగా మారింది. కానీ, గాల్వన్​- షాయోక్ నదుల సంగమం ప్రాంతంలో చైనా శిబిరాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది.

(రిపోర్ట్​- సంజీవ్​ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.