ETV Bharat / bharat

'పాంగాంగ్​లో కొత్త నిర్మాణాల కూల్చివేతకు అంగీకారం' - ఎనిమిదో కమాండర్ స్థాయి చర్చలపై విదేశాంగ శాఖ ప్రకటన

భారత్-చైనా మధ్య జరిగిన ఎనిమిదో విడత కమాండర్ స్థాయి చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బలగాల ఉపసంహరణపై చర్చించినట్లు వెల్లడించింది. త్వరలోనే మరో దఫా సమావేశమయ్యేందుకు అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది.

disengagement-at-all-friction-points-along-lac-discussed-during-commander-level-talks-mea
'నిర్మాణాత్మకంగా ఎనిమిదో విడత చర్చలు'
author img

By

Published : Nov 13, 2020, 2:06 PM IST

భారత్-చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చలు దాపరికం లేకుండా, నిర్మాణాత్మకంగా సాగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ సమీపంలోని చుషుల్​ ప్రాంతంలో గతవారం జరిగిన చర్చలపై స్పందించింది. ఘర్షణ పాయింట్ల వద్ద బలగాల ఉపసంహరణపై సమాలోచనలు జరిపినట్లు వెల్లడించింది.

సైనిక, దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. పెండింగ్​లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికీ కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే మరో విడత చర్చలు జరిపాలని అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.

"చర్చలు ఎలాంటి దాపరికం లేకుండా జరిగాయి. ఘర్షణ ప్రాంతాల్లోని బలగాలను ఉపసంహరించే అంశంపై లోతుగా, నిర్మాణాత్మకంగా ఇరుపక్షాలు సమాలోచనలు జరిపాయి."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి

కమాండర్ స్థాయి సమావేశంలో ఇరుపక్షాలు చర్చించిన బలగాల ఉపసంహరణ ప్రణాళికల ప్రకారం పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఏప్రిల్-మే తర్వాత చేపట్టిన నూతన నిర్మాణాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బలగాలను క్రమంగా అక్కడి నుంచి ఉపసంహరించాల్సి ఉంటుంది.

చర్చల్లో కానరాని ఫలితం

లద్దాఖ్​లో ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుపక్షాలు భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దుకు తరలించాయి. ఉద్రిక్తతల నివారణకు చేపడుతున్న చర్చల్లో పురోగతి లభించడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.