ETV Bharat / bharat

డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్​లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. డ్రాగన్ ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్​ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతోంది. భారత్ తీసుకున్న తాజా చర్యతో... చైనా టెక్నాలజీ కంపెనీలకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

India bans 59 apps including TikTok, UC Browser
డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం
author img

By

Published : Jun 30, 2020, 4:50 AM IST

చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అత్యంత ప్రజాదరణ పొందిన టిక్​టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్​లపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ యాప్​లు భంగం కలిగిస్తుండడమే తాజా చర్యకు కారణమని స్పష్టం చేసింది. ఈ యాప్​లను నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే టెలికాం కంపెనీలకు అదేశాలు జారీచేసినట్లు పేర్కొంది.

భారత్​-చైనాల మధ్య తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చైనా ఓ వైపు శాంతి వచనాలు పలుకుతూ, మరోవైపు దొంగదెబ్బతీయాలని చూస్తోంది. అందుకే చైనా ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్​ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతోంది.

దేశ భద్రత ముఖ్యం

"ఆండ్రాయిడ్, ఐఓఎస్​ ప్లాట్​ఫాంల్లోని కొన్ని చైనా యాప్​లు దేశ భద్రతకు, రక్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇది దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు భంగం కలిగించే అంశం. అందుకే ఆ యాప్​లను తక్షణం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం."

- కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ

తాజా చర్య దేశంలోని కోట్లాది మంది మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, సైబర్ దాడుల నుంచి రక్షణ కలిగిస్తుందని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ పేర్కొంది. ఫలితంగా 130 కోట్ల భారతీయుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటుందని అభిప్రాయపడింది.

నిషేధిత చైనా యాప్​ల జాబితా

India bans 59 apps including TikTok, UC Browser
డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

1. టిక్‌టాక్‌ 2. షేర్‌ఇట్‌ 3. క్వాయి 4. యూసీ బ్రౌజర్‌ 5. బైడుమ్యాప్‌ 6. షెయిన్‌ 7. క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌ 8. డియూ బ్యాటరీ సేవర్‌ 9. హెలో 10. లైకీ 11. యూక్యామ్‌ మేకప్‌ 12. ఎంఐ కమ్యూనిటీ 13. సీఎం బ్రౌజర్‌ 14. వైరస్‌ క్లీనర్‌ 15. ఏపీయూఎస్‌ బ్రౌజర్‌ 16. రోమ్వే 17. క్లబ్‌ ఫ్యాక్టరీ 18. న్యూస్‌డాగ్‌ 19. బ్యూటీ ప్లస్‌ 20. వీచాట్‌ 21. యూసీ న్యూస్‌ 22. క్యూక్యూ మెయిల్‌ 23. వెయిబో 24. జెండర్‌ 25. క్యూక్యూ మ్యూజిక్‌ 26. క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌ 27. బిగో లైవ్‌ 28. సెల్ఫీసిటీ 29. మెయిల్‌ మాస్టర్‌ 30. ప్యార్‌లల్‌ స్పేస్‌ 31. షియామీ ఎంఐ వీడియోకాల్‌ 32. వియ్‌సింక్‌ 33. ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ 34. వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్‌ 35. మీటు 36. విగో వీడియో 37. న్యూ వీడియో స్టేటస్‌ 38. వాల్ట్‌-హైడ్‌ 39. కెచె క్లీనర్‌ డీయూ యాప్‌ స్టూడియో 41. డీయూ క్లీనర్‌ 42. డీయూ బ్రౌజర్‌ 43. హగో ప్లే విత్‌ న్యూ ఫ్రెండ్స్‌ 44. క్యామ్‌ స్కానర్‌ 45. క్లీన్‌ మాస్టర్‌-చీటా మొబైల్‌ 46. వండర్‌ కెమెరా 47. ఫోటో వండర్‌ 48. క్యూక్యూ ప్లేయర్‌ 49. వియ్‌ మూట్‌ 50. స్వీట్‌ సెల్ఫీ 51. బైడు ట్రాన్స్‌లేట్‌ 52. విమేట్‌ 53. క్యూక్యూ ఇంటర్నేషనల్‌ 54. క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌ 55. క్యూక్యూ లాంచర్‌ 56. యూ వీడియో 57. వీ ఫ్లై స్టేటస్‌ వీడియో 58. మొబైల్‌ లెజెండ్స్‌ 59. డీయూ ప్రైవసీ.

వీటి గతేంటి?

  • టిక్​టాక్​, హలో: అత్యంత ఆదరణ పొందిన టిక్​టాక్​కు​ భారత్​లో 200 మిలియన్లకుపైగా ​వినియోగదారులు ఉన్నారు. హలో యాప్​ కూడా భారత్​లో ఆదరణ పొందినదే. ఈ రెండూ చైనాకు చెందిన బైట్​డాన్స్ సంస్థకు చెందినవి.
  • ఈ-కామర్స్ వేదికలు: చైనా ఈ-కామర్స్ ప్లాట్​ఫాంలు క్లబ్ ఫ్యాక్టరీ, షీన్​ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ రెండూ మింత్రా వంటి పెద్ద ప్రత్యర్థితో పోటీ పడుతున్నవే.
  • యూసీ బ్రౌజర్​: 'అలీబాబా'కు చెందిన యూసీ బ్రౌజర్ 2009 నుంచి భారత్​లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజర్​ 2019 సెప్టెంబర్​ నాటికి ప్రపంచవ్యాప్తంగా (చైనాను మినహాయించి) 1.1 బిలియన్ డౌన్​లౌడ్లు సాధించింది. ఇందులో సగం భారత్​లోనే డౌన్​లౌడ్ అయ్యాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే యూసీ బ్రౌజర్​కు.. భారత్​లో 130 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు.
  • ఎంఐ కమ్యూనిటీ యాప్స్: భారత్​లో అత్యంత ఆదరణ పొందిన చైనా హ్యాండ్​సెట్ బ్రాండ్ షియోమీ. దీనికి చెందిన ఎంఐ కమ్యూనిటీ యాప్స్, ఎంఐ వీడియో కాల్​లను కూడా భారత్ నిషేధించింది.

2015-19లో చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్, టిఆర్​ క్యాపిటల్, హిల్​హౌస్ క్యాపిటల్... భారతీయ (స్టార్టప్) అంకుర సంస్థల్లో 5.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయని వెంచర్ ఇంటెలిజెన్స్ తెలిపింది. అయితే భారత్ తీసుకున్న తాజా చర్యతో... చైనా టెక్నాలజీ కంపెనీలకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ కారిడార్​ను పునరుద్ధరించిన పాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.