ETV Bharat / bharat

కరోనా చికిత్సపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలని కేంద్రాన్ని, దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించింది.

Increase beds, ventilators for COVID-19 patients: HC to Centre, Delhi govt
మంచాలు, వెంటిలేటర్ల సంఖ్య పెంచండి: దిల్లీ హైకోర్టు
author img

By

Published : Jun 13, 2020, 5:04 PM IST

దేశ రాజధాని దిల్లీని కరోనా పట్టి పీడిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. సరిపడా సౌకర్యాలు లేక ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్ల సంఖ్య పెంచాలని కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది దిల్లీ హైకోర్టు.

దక్షిణ దిల్లీలోని డిఫెన్స్​ కాలనీలో కంటెయిన్​మెంట్​ మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మృదుల్​ చక్రవర్తి సహా పలువురు న్యాయవాదులు పిటిషన్​ వేశారు. దేశ రాజధాని ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారని హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిపై దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. "దిల్లీలో జూన్​ 9 వరకు 9, 179 పడకలు అందుబాటులో ఉండగా.. నాలుగు రోజుల్లోనే 4,914 మంచాలు భర్తీ అయ్యాయి. 569 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా... వాటిలో 315 వెంటిలేటర్లు చికిత్స మేరకు ఉపయోగిస్తున్నారు" అని తెలిపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

ఆసుపత్రులు తమ వద్ద ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయో ఎప్పటికప్పుడు పక్కా సమాచారం ఇవ్వాలని... అప్పుడే బాధితులు తాము ఏ ఆసుపత్రికి వెళ్లాలో నిర్ణయించుకుంటారని పేర్కొంది దిల్లీ హైకోర్టు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.