ETV Bharat / bharat

లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే గాడిదపై ఊరేగింపు! - బీడ్​ జిల్లా కేజ్​ తహసీల్​

కరోనా లాక్​డౌన్​ నిబంధనలు పాటించని వారికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించింది మహారాష్ట్రలోని ఓ గ్రామం. ఆంక్షలు ఉల్లంఘిస్తే గాడిదపై ఊరేగించాలని తీర్మానించింది.

In Maha village, donkey parade for those stepping out of homes
ఔరా..అక్కడ బయటకొస్తే గాడిదపై ఊరేగిస్తారట!
author img

By

Published : Apr 2, 2020, 1:01 PM IST

కొవిడ్​-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే సామాజిక దూరం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. ఆంక్షల అమలు కోసం ఉన్నత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినా కొందరు లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది మహారాష్ట్రలోని ఓ గ్రామం. సరైన కారణం లేకుండా బయటకొచ్చేవారిని గాడిదపై ఊరేగించాలని తీర్మానించింది.

మహారాష్ట్ర బీడ్​ జిల్లా కేజ్​ మండలంలోని తకలి గ్రామ ప్రజలంతా కలిసి మార్చి 29న ఈ తీర్మానం చేశారు.

" ప్రజల్ని బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి సారి బయటకు వస్తే రూ.500 జరిమానా విధిస్తాం. కారణం లేకుండా పదేపదే బయటకు వచ్చే ఆ వ్యక్తిని గాడిదపై కూర్చోపెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తాం. ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం."

-- విష్ణు ఘులే, తకలి గ్రామ సర్పంచ్

ఇదీ చదవండి: ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్​ హతం​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.