క్యాన్సర్‌తో పోరాడుతున్న 5వ తరగతి విద్యార్థిని కలిశాక అపర్ణ తన కేశాలు క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసే సంస్థకు ఇవ్వాలనుకున్నారు. వెంటనే త్రిస్సూర్‌లోని అమల ఆసుపత్రిలో ఆమె కురులను దానం చేశారు. అందం అనేది బాహ్య సౌందర్యంలోనిది కాదని.. మనం చేసే ప్రతి పని, ప్రతి మాటలో కనిపించాలంటారు అపర్ణ.
గతంలో తమ చిన్నారికి చికిత్స చేయించాలని ఓ పేద కుటుంబం అపర్ణను ఆశ్రయించింది. వెంటనే తన చేతికున్న బంగారు గాజులను తీసి వారికి ఇచ్చారు అపర్ణ. మానసిక అందాన్ని చాటిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అపర్ణకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.