కర్ణాటక గడగ్ జిల్లాలో ఎన్నో గ్రామాలు మలప్రభ నది ఉగ్రరూపంతో నీటమునిగాయి. నారగుండ తాలుకా లక్కమపురను వరద తీవ్రంగా నష్టపరిచింది. ఆ గ్రామాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే వంతెన, రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
లక్కమపుర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పొట్ట చేత పట్టుకుని సమీప గ్రామాలకు చేరుకున్నారు. నిరాశ్రయులై రోడ్లపైనే కాలం గడుపుతున్నారు. దాతలు అందించే రొట్టెలు, పచ్చడితో పొట్ట నింపుకుంటున్నారు. కనీసం ఉండేందుకు తాత్కాలిక గుడారాలు లేక చలికి, వానకు వణికిపోతున్నారు.