ETV Bharat / bharat

బిహార్​లో 'హాథ్రస్' తరహా ఘటన​

'హాథ్రస్'​ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా మరువనే లేదు! బిహార్​లో అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కీచకుల క్రూరత్వానికి 12 ఏళ్ల బాలిక బలైంది. సదరు చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు.. అర్ధరాత్రి సమయంలోనే ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. జనవరి 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

bihar minor rape
బిహార్​లో మరో 'హాథ్రస్'​.. మైనర్​పై గ్యాంగ్ రేప్​
author img

By

Published : Feb 8, 2021, 6:06 PM IST

దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు ఆగడం లేదు. యూపీలో జరిగిన 'హాథ్రస్'​ ఘటనను గుర్తుకు తెచ్చే మరో అమానవీయ ఘటన.. బిహార్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు చంపారన్​ జిల్లాలో మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కీచకులు. ఆపై బాలిక మృతదేహాన్ని రాత్రికి రాత్రే దహనం చేశారు.

ఏం జరిగింది?

నేపాల్​కు చెందిన ఓ కుటుంబం.. మోతిహరీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. కూలీ పనులు చేసే కడుపు నింపుకొనే వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. జనవరి 21న చిన్నారి.. ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందిందని బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు.

పోలీసుల నిర్లక్ష్యం..

ఈ ఘటన గురించి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. కేసు నమోదు చేసేందుకు నిరాకరించినట్లు బాధిత బాలిక తండ్రి చెప్పారు.

"స్టేషన్​కు వెళ్లినప్పుడు పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. పైగా కేసు పెట్టవద్దని ఒత్తిడికి గురిచేశారు. బాలిక మృతదేహాన్ని దహనం చేయాలని నిందితులు మమ్మల్ని బలవంతం చేశారు. అర్ధరాత్రి సమయంలోనే మృతదేహాన్ని దహనం చేశారు.

-బాధిత బాలిక తండ్రి

వైరల్​గా మారగా..

తమకు న్యాయం చేయాలని కోరుతూ.. బాధిత బాలిక తండ్రి చెప్పిన మాటల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో.. స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు సదరు పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జిని అధికారులు సస్పెండ్​ చేశారు.

"వైరల్​గా మారిన వీడియోలో ఎస్​హెచ్​ఓ సంజీవ్​ కుమార్​ తన విధులు నిర్వర్తించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. ఆయనను సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై సాక్ష్యాధారాలు దొరికితే ఆయనపై ఎఫ్​ఐఆర్​ కూడా నమోదు చేస్తాం."

-ఎస్పీ, నవీన్​ చంద్ర ఝా

11 మంది నిందితులు

ఈ ఘటనపై ఫిబ్రవరి 2న పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని దహనం చేయాలని నిందితులు బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 11 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో నలుగురి పేర్లను గ్యాంగ్​ రేప్​ కింద చేర్చారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్​) నియమించినట్లు తెలిపారు.

రాజకీయ దుమారం..

తూర్పు చంపారన్​ జిల్లాలో జరిగిన ఈ హత్యాచార ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. బిహార్​ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష ఆర్జేడీ దుయ్యబట్టింది. ఈ ఘటనను 'హాథ్రస్​ విషాదం'గా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. వైఫల్యాలలో అలెగ్జాండర్​లా మారారని విమర్శించారు.

ఇదీ చదవండి:ఎంపీలో దారుణం- ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.