ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా తగ్గిన హాట్​స్పాట్​ జిల్లాలు.. కానీ... - కరోనా వైరస్​ ఇండియా

దేశంలో కరోనా వైరస్​ హాట్​స్పాట్​ జిల్లాలు రెండు వారాల వ్యవధిలో 170 నుంచి 129కి తగ్గాయి. కానీ గ్రీన్​ జోన్లు 325 నుంచి 307కు తగ్గాయి. అదే సమంయలో ఆరెంజ్​ జోన్లు 207 నుంచి 297కు పెరిగాయి.

In a fortnight, number of COVID-19 hotspot districts decreases to 129 from 170
దేశవ్యాప్తంగా తగ్గిన హాట్​స్పాట్​ కేంద్రాలు.. కానీ
author img

By

Published : Apr 29, 2020, 6:24 PM IST

బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా ఉన్న హాట్​స్పాట్(రెడ్​ జోన్లు)​ జిల్లాల సంఖ్య 129కి పడిపోయింది. రెండు వారాల క్రితం ఆ సంఖ్య 170గా ఉంది. అదే సమయంలో గ్రీన్​ జోన్లు 325 నుంచి 307కు తగ్గాయి. అయితే ఈ రెండు వారాల వ్యవధిలో ఆరెంజ్​ జోన్లు 207నుంచి 297కు చేరాయి.

కరోనా వైరస్​ వ్యాప్తి రేటు అధికంగా ఉన్నా లేక కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నా ఆ ప్రాంతాలను రెడ్​ జోన్లుగా పరిగణిస్తారు. కొంతమేర తక్కువగా కేసులుంటే ఆరెంజ్​ జోన్​ అని.. అసలు కరోనా కేసులే లేని జిల్లాలను గ్రీన్​జోన్లుగా పిలుస్తారు.

రెడ్​ జోన్లలో 28, ఆరెంజ్​ జోన్లలో 14 రోజులపాటు ఎలాంటి కేసులు నమోదుకాకపోతే.. ఆ ప్రాంతాలను గ్రీన్​జోన్​ల జాబితాలో చేరుస్తారు.

ఏప్రిల్​ 15న.. దేశవ్యాప్తంగా ఉన్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 170 జిల్లాలను హాట్​స్పాట్లుగా ప్రకటించింది ప్రభుత్వం.

కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య(రోజుల్లో)

  • 7 రోజులు - 80 జిల్లాలు
  • 14 రోజులు - 47 జిల్లాలు
  • 2 రోజులు - 39 జిల్లాలు
  • 28 రోజులు - 17 జిల్లాలు

కేసుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు...

వడోదర(గుజరాత్​), కర్నూల్​(ఆంధ్రప్రదేశ్​), భోపాల్​(మధ్యప్రదేశ్​), జోధ్​పుర్​(రాజస్థాన్​), ఆగ్రా(ఉత్తరప్రదేశ్​), ఠాణె(మహారాష్ట్ర), చెన్నై(తమిళనాడు), సూరత్​(గుజరాత్​), హైదరాబాద్​(తెలంగాణ), పుణె(మహారాష్ట్ర), జైపుర్​(రాజస్థాన్​), ఇండోర్​(మధ్యప్రదేశ్​), అహ్మదాబాద్​(గుజరాత్​), ముంబయి(మహారాష్ట్ర), దిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.

కరోనాపై భారత్​ విజయం సాధించాలంటే ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టిసారించాలని అధికారులు వెల్లడించారు. పరీక్షలు ఎక్కువగా జరపాలన్నారు.

ఇదీ చూడండి:- ప్లాస్మా థెరపీపై ఎయిమ్స్ క్లినికల్ ట్రయల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.