ETV Bharat / bharat

ఆర్​టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవర్ల నియామకం

author img

By

Published : Aug 21, 2020, 6:42 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు రవాణా సంస్థలో తొలిసారి మహిళా డ్రైవర్లను నియమించున్నారు. ఇందుకోసం శుక్రవారం మహిళా అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు అధికారులు. ఎంపికైన వారు నిర్భయ నిధి ద్వారా కొనుగోలు చేసిన బస్సుల్లో సేవలు అందించనున్నారు.

women bus drivers
మహిళా డ్రైవర్ల నియామకం

మహిళా సాధికారత, భద్రత దిశగా ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలను డ్రైవర్లుగా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కౌశాంబీలో శుక్రవారం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని ఘాజియాబాద్​ రూట్లలో నియమించనున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా మహిళలను నియమించటం ఇదే మొదటిసారి అని ఘాజియాబాద్ డిపో మేనేజర్ అఖిలేశ్ సింగ్ తెలిపారు.

"నిర్భయ నిధి ద్వారా కొనుగోలు చేసిన బస్సుల్లో మహిళలే డ్రైవర్లుగా ఉంటారు. మహిళా చోదకులను నియమించటం ఇదే తొలిసారి. వీరిని చూసి మహిళా ప్రయాణికులకు భద్రతపై భరోసా ఉంటుంది. వీరి స్ఫూర్తితో మరికొంత మంది డ్రైవింగ్​ను తమ వృత్తిగా ఎంచుకునే అవకాశం ఉంటుంది."

- అఖిలేశ్ సింగ్

ఈ ప్రత్యేక బస్సుల్లో కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అఖిలేశ్ తెలిపారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు 'పానిక్ బటన్​'ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో ట్రాన్స్​జెండర్లకు ఆస్తిలో సమాన వాటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.