ETV Bharat / bharat

వరి రైతులకు రాయల్టి.. దేశంలోనే తొలిసారి - వరి పంట పొలాలకు కేరళ ప్రభుత్వం ఇస్తున్న రాయల్టీ ఎంత

వరి పంట పండే పొలాల సంరక్షణ కోసం కేరళ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలిసారిగా వరి పొలాల యజమానులకు రాయల్టీ చెల్లించేదుకు సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక పథకం కోసం ఈ ఏడాదికి రూ.40 కోట్లు కేటాయించింది.

Kerala announced royalty paddy field owners
దేశంలోనే తొలిసారి వరి రైతులకు రాయల్టి
author img

By

Published : Nov 7, 2020, 7:12 AM IST

దేశంలోనే తొలిసారి వరి పొలాల రైతులకు రాయల్టీ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది కేరళ. సాగులో ఉన్న వరి పంటకు వార్షిక ప్రాతిపదికన హెక్టార్​కు రూ.2 వేలు రాయల్టీగా ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆన్​లైన్ ద్వారా ప్రారంభించారు.

రాయల్టీ ఎందుకంటే..

వరి పొలాల యజమానులకు రాయల్టీ ఇవ్వడం ఇదే ప్రథమమని కేరళ వ్యవసాయ శాఖ తెలిపింది. వరి పంట నిల్వ, నిర్వహణ, పోత్సాహానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వరి పండే పొలాలను ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా ఉండేదుకు కూడా రాయల్టీ ఉపయోగపడుతుందని వివరించింది. రాయల్టీ కోసం ఈ ఏడాది రూ.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో పండించే పంటలకు కనీస ధర నిర్ణయించే విధానం ఈ నెల ఆరంభం నుంచే అమలులోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు రాయల్టీ పథకాన్ని ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి:రైతులకు కేరళ ప్రభుత్వం అండ.. కనీస ధర ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.