ETV Bharat / bharat

రూ.209కోట్ల ఐఎంఏ సంస్థల ఆస్తులు జప్తు - Rs 209 crore

కర్ణాటక ఐఎంఏ సంస్థల పోంజి కుంభకోణం కేసులో రూ.209కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్ ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​  జప్తు చేసింది. వేలాది మంది డిపాజిటర్లను సంస్థ మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.

రూ.209కోట్ల ఐఎంఏ సంస్థల ఆస్తులు జప్తు
author img

By

Published : Jun 28, 2019, 5:03 PM IST

Updated : Jun 28, 2019, 10:34 PM IST

పోంజి కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఐఎంఏ సంస్థలకు సంబంధించిన రూ.209 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) జప్తు చేసింది. ఇందులో రూ.197కోట్లు విలువ చేసే స్థిరాస్తులు, రూ.12కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రూ.40వేల కోట్ల పెట్టుబడులు నష్టపోతామనే భయంతోనే ఐఎంఏ సంస్థల మేనేజింగ్​ డెరెక్టర్​ మన్సూర్​ ఖాన్​ అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఇటీవలే ఈడీ ఈయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

పోంజి స్కీమ్​ పేరుతో ఐఎంఏ సంస్థ ప్రజలను మోసం చేసి మనీలాండరింగ్​కు పాల్పడి స్థిరాస్తులు, చరాస్థులను కూడబెట్టినట్లు ఈడీ తెలిపింది. ప్రతినెల 2.5నుంచి 3శాతం వరకు లాభాలొస్తాయని ఇన్వెస్టర్లకు ఖాన్​ చెప్పినట్లు పేర్గొంది. వీరిలో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.

పెట్టుబడులు మొత్తం నష్టపోయినట్లు ఖాన్​ విడుదల చేసిన వీడియోతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఖాన్​కు గతంలో పలుమార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ముందు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. ఆయన దేశం వీడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇంటర్​పోల్ అరెస్టు వారెంటు జారీ చేసి ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఈడీ పేర్కొంది.

కర్ణాటక మంత్రికి ఈడీ నోటీసులు

పోంజి కుంభకోణం కేసుకు సంబంధించి కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్​కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

ఐఎంఏ సంస్థల ఎండీ మన్సూర్​కు తాను అమ్మిన ఓ ఆస్తి వివరాలను జులై 5లోగా పొందుపరచాలని ఈడీ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి జమీర్​ తెలిపారు.

ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: బౌద్ధ గురువు దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర

Intro:Body:

t

Conclusion:
Last Updated : Jun 28, 2019, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.