భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)ను వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం-ఐఎంఏ నేడు బంద్కు దిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె... 24 గంటలపాటు కొనసాగనుంది. బంద్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.
ఈ బంద్కు దేశవ్యాప్తంగా జూడాలు, కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.
సర్వత్రా ఆందోళనలు...
ఎన్ఎంసీ బిల్లుకు ఇటీవలే లోక్సభలో ఆమోదం లభించింది. బిల్లును నిరసిస్తూ 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు దిల్లీ వేదికగా సోమవారం నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.
ఇదీ చూడండి: వేతన కోడ్ బిల్లుకు లోక్సభ ఆమోదం