ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు - IMA begins hunger strike latest news

శస్త్రచికిత్సలు చేయడానికి ఆయుర్వేద వైద్యులకూ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. దేశంలో 50 ప్రాంతాల్లో ఈ సమ్మె జరిగినట్లు వెల్లడించారు.

IMA begins hunger strike over govt's move allowing Ayurveda doctors to perform surgery
దేశవ్యాప్తంగా ప్రారంభమైన డాక్టర్ల సమ్మె
author img

By

Published : Feb 1, 2021, 10:53 PM IST

ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్​కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో డాక్టర్లందరూ ఈ దీక్షలో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ నెల 14 వరకు రిలే సమ్మె కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నెల 7న మహిళా వైద్యులు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆయుష్​మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్​ అశాస్త్రీయంగా ఉందని వైద్య సంఘం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానాలు 'మిక్సోపతి'కి దారితీస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది. దీనిని తక్షణమే ప్రభుత్వం ఉపసహంరించుకోవాలని డిమాండ్​ చేసింది.

ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోస్టర్లు, బ్యానర్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రజా భద్రతా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు, కార్యదర్శి సహా ఇతర ఐఎంఏ నేతలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలను సందర్శిస్తారని వైద్యుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: సభా సమయాల్లో స్వల్ప మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.